పవన్ కళ్యాణ్ నీ లాంచ్ చేయడం కోసం చిరంజీవి ఇంత భారీ ప్లాన్ చేశారా ?

స్వయంకృషితో ఎదిగి టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తంగా ఎంతో మందికి ఆదర్శనీయంగా మారిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.ఆయన తీసిన సినిమాలు ఎంతోమందికి ఆదర్శం.

అలాగే ఆయన సొంత తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ ని లాంచ్ చేయాలని అనుకున్న తర్వాత ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయట.తమ్ముడు ని ఎలాగైనా లాంచ్ చేయాలి వాడు పెద్ద హీరో అయిపోవాలని చిరంజీవి( Chiranjeevi ) అనుకున్నా )రట.అందుకోసం పకడ్బందీగా గట్టి ప్లాన్ ని కూడా తయారు చేశారట.మామూలుగా లాంచ్ చేస్తే అందులో మాట్లాడుకోవడానికి ఏముంటుంది.

అందుకే చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం చేసిన ఆ లాంచింగ్ ఏర్పాట్లు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదట పవన్ కళ్యాణ్( Pawan Kalyan )కోసం చాలామంది దర్శకులను పరిశీలించారట.చివరగా ఇవివి సత్యనారాయణకు ఆ బాధ్యతను అప్పగించారట.ఇక సినిమా కథ విషయానికొస్తే కొత్త కథతో కాకుండా రీమేక్ తో పవన్ కళ్యాణ్ ని లాంచ్ చేయాలని అనుకున్నారట అందుకోసం బాలీవుడ్ లో అమెరికన్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ అనే చిత్రాన్ని తెలుగులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి( Akkada Ammayi Ikkada Abbayi ) పేరుతో కథ సిద్ధం చేయించారు.

Advertisement

ఇక ఈ చిత్రాన్ని నిర్మించే బాధ్యతను చిరంజీవి అల్లు అరవింద్( Allu Arvind ) కి అప్పగించగా గీత ఆర్ట్స్ పై ఈ సినిమా నిర్మాణం మొదలు పెట్టుకుంది.అయితే జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం చిరంజీవి మొదట ఈ అబ్బాయి ఎవరు అంటూ పవన్ కళ్యాణ్ తో తయారు చేయించిన పోస్టర్ ను విడుదల చేశారట.

ఆ తర్వాత కొన్ని రోజులకు ఎస్ హి ఇజ్ పవన్ కళ్యాణ్ అంటూ రివీల్ చేసి ప్రేక్షకులకు తన తమ్ముడిని పరిచయం చేశారట.ఇక వేలాదిగా అభిమానులను పిలిచి ఒక వేదికగా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ తన తమ్ముడని ఈ సినిమా తీయబోతున్నాడని గట్టిగా ప్రకటన చేశాడట.

ఈ సినిమా కోసం హీరోయిన్గా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు అయిన సుప్రియ(Supriya Yarlagadda )ను ఎంపిక చేశారట.రెండు పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న వారసుల సినిమా కాబట్టి దీనిపై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఏర్పడతాయని అందరు నమ్మారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన స్టంట్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.

చాతిపై పెద్ద పెద్ద బండలను పగలగొట్టించుకోవడం, కారు టైర్లను వేళ్ళ మీదుగా పోనిచ్చుకోవడం అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన ఈ రియల్ స్టంట్ లు చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు.ఇక హీరోయిన్ అయితే షూటింగ్ సమయంలో కన్నీళ్లు పెట్టుకుందట.1996లో విడుదలైన ఈ సినిమా 32 సెంటర్లో 50 రోజులు పూర్తి చేసుకోగా రెండు సెంటర్స్ లో వంద రోజులు పూర్తిచేసుకుని పవన్ కళ్యాణ్ కి మంచి లాంచింగ్ మూవీ అయింది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు