ఆ నటుడి విషయం లో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) అంటే ఇండస్ట్రీ లో చాలా పెద్ద హీరో అనే చెప్పాలి ఆయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి సినిమాల విషయం లోనే కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి అనే విషయం ఆయన చేసిన సేవ కార్యక్రమాలు చూస్తేనే మనకు అర్థం అవుతుంది.

తాను పెట్టిన బ్లడ్ బ్యాంకు ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడుతున్నారు అందుకే చిరంజీవి అంటే అందరికి విపరీతమైన ఇష్టం.

మొన్నటికి మొన్న కరోనా టైములో కూడా చాలా మంది సినీ కార్మికులకు తినడానికి తిండి పెట్టించాడు అలాగే వాళ్లకి కావాల్సిన వంట సామాగ్రి కూడా అందించాడు.

ఇక ఈ మధ్య తెలిసిన న్యూస్ ఏంటి అంటే తమిళ నటుడు అయినా పొన్నెబలం( Ponnebalam ) అనే నటుడు చాలా సినిమాల్లో విలన్ గా చేసాడు అయితే ఆయన కి ఆరోగ్యం బాగా చెడిపోవడం తో ఏం చేయాలో అర్థం కాకా చిరంజీవి కి తన ప్రాబ్లమ్ వివరించాడట తన రెండు కిడ్నీ లు చెడిపోవడం తో ఆయన బతకడమే కష్టం అనుకున్న టైం లో చిరంజీవి ని సహాయం అడగగానే చిరంజీవి వెంటనే ఫోన్నెంబలం తో ఇప్పుడు నీకు అపోలో హాస్పిటల్( Apollo Hospital ) నుంచి కాల్ వస్తుంది వెళ్లి ఆ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వు అంత నేను చూసుకుంటా అని చెప్పాడట దాంతో ఫోన్నెంబలం కి చాలా సంతోషం వేసిందట అయితే తాను అడిగిన సహాయానికి చిరంజీవి ఒక లక్ష, రెండు లక్షలు ఇస్తాడు అనుకున్నాడట కానీ చిరంజీవి డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ బిల్ మొత్తం చెల్లించారట అది ఎంత అయింది అంటే అక్షరాలా 40 లక్షల రూపాయలు అయిందట ఈ విషయాన్నీ స్వయంగా తనే ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలియజేసారు.అలాగే తన తమ్ముడే తనని చంపాలని చూశాడని ఏ సంభందం లేని చిరంజీవి గారు నన్ను కాపాడారని చెప్తూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు.ఫోన్నెంబలం చాలా తమిళ్ సినిమాల్లో నటించాడు తెలుగులో కూడా హిట్లర్ లాంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు