టాలీవుడ్‌పై చిరు పెత్తనంను వాళ్లు తట్టుకోలేక పోతున్నారా?

దాసరి నారాయణ రావు మృతి చెందినప్పటి నుండి కూడా టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా చిరంజీవి మారిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎలాంటి వివాదం వచ్చినా, విడుదల విషయంలో గొడవలు వచ్చినా, బిజినెస్‌ విషయంలో మరో సమస్య వచ్చినా ఇలా అన్నింటికి కూడా చిరంజీవి తాను ఉన్నాను అంటూ పెద్ద దిక్కుగా రెండు వైపుల సముదాయించి గొడవ సర్దుమనిగేలా చేస్తున్నాడు.

ఇక కరోనా విపత్తు సమయంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ ఏర్పాటు చేసి తనవంతుగా కోటి రూపాయలు ఇచ్చి అలాగే కోట్లాది విరాళాలు సేకరించి సినీ కార్మికులకు సాయం చేశారు.ఇక ప్రభుత్వం నుండి షూటింగ్స్‌ కోసం తాజాగా తన ఇంట్లో ఒక మీటింగ్‌ ఏర్పాటు చేయించాడు.

ఆ మీటింగ్‌కు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.మంత్రి తలసాని కూడా ఆ భేటీలో హాజరు అయ్యాడు.

అయితే కొందరు మాత్రం ఆ మీటింగ్‌కు దూరంగా ఉండి చిరంజీవి పెత్తనంపై పెదవి విరుస్తున్నట్లుగా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.చిరంజీవి పెత్తనం మరీ ఎక్కువ అయ్యిందంటూ వారు అసహనంతో ఉన్నారట.

Advertisement
Chiranjeevi,Bigwigs, Tollywood Heroes, Meeting, Talasani Yadav, Movie Shootings-

చిరంజీవి చెప్పకుంటే షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వరా అంటున్నారు.

Chiranjeevi,bigwigs, Tollywood Heroes, Meeting, Talasani Yadav, Movie Shootings

చిరంజీవి పెత్తనం విషయంలో ఆ ఇద్దరు ముగ్గురు హీరోలు కాస్త ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట.చిరంజీవితో పైకి బాగానే వారు ఉంటున్నా కూడా లోలోపల మాత్రం కుళ్లుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.మరికొందరు మాత్రం ఎంతో ఓపికగా ఈ వయసులో కూడా పెద్దరికం మీద వేసుకుని చిరంజీవి చేస్తున్న పనికి అందరు అభినందనలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు