మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అనంతపురంలో భారీ ఎత్తున మెగా అభిమానుల సమక్షంలో జరగబోతున్న విషయం కూడా తెలిసిందే.
ఈ సినిమా ప్రీ రిలీజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సాధారణంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లేదా సినిమా ఇతర కార్యక్రమాలు ముఖ్య అతిథి సమక్షంలో జరుగుతూ ఉంటాయి.
కానీ ఈ సినిమా మాత్రం చిరంజీవి చిత్ర యూనిట్ సభ్యులు కాకుండా మరి ఎవరు ముఖ్య అతిధులు పాల్గొనడం లేదని సమాచారం అందుతుంది.మెగాస్టార్ చిరంజీవి మొదట పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించాలని భావించాడు అంటూ వార్తలు వచ్చాయి.
కానీ ఆయన విదేశీ పర్యటన ఉండడం వల్ల ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు.
ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఉంటాడా లేదా అనే విషయమై చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం అనంతపురంలో మొదలైంది.మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి వేదిక వద్దకు వస్తాడు.
ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా యొక్క థియేటర్ ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికే చిరంజీవి మరియు ఇతర యూనిట్ సభ్యులు ఆ యొక్క ట్రైలర్ ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారట, మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి గాడ్ ఫాదర్ సినిమా పై అంచనాలు కలిగే విధంగా ట్రైలర్ ఉండబోతుంది అంటూ మెగా కాంపౌండ్ నుండి వార్తలు వస్తున్నాయి.
అక్టోబర్ 5వ తారీఖున నాగార్జున నటించిన సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకు ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురు కాబోతుంది.
ఈ రెండు సినిమాలతో పాటు స్వాతిముత్యం సినిమా కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తానంటూ రాబోతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy