కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్న చిరంజీవి...

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి.

( Megastar Chiranjeevi ) సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వర రావు తర్వాత ఆ రేంజ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కూడా చిరంజీవే కావడం విశేషం.

ఆయన గత 50 సంవత్సరాలు నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక నటుడు కావడం విశేషం.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తు అనే రేంజ్ లో ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పటికే ఆయన లైనప్ చాలా పెద్దగా ఉన్నట్టుగా తెలుస్తోంది.అనిల్ రావిపూడి,( Anil Ravipudi ) శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) లాంటి స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికి ఆయన మరొక కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనేదానిమీద ఇంకా సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

కానీ చిరంజీవి మాత్రం ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి సన్నహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఎందుకు అంటే ఆ దర్శకుడు చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట.

Advertisement

అలాగే ఆ కథలోని కొన్ని కోర్ ఎమోషన్స్ ను పండించేలా ఒక డెమో ఫిలిం కూడా చేయమని చెప్పారట.ఇక డెమో ఫిలిం కూడా చేసిన ఆ వ్యక్తికి చిరంజీవి ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

అయితే తొందర్లోనే ఈ సినిమాని అనౌన్స్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల సినిమాల తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.మరి ఆ దర్శకుడు ఎవరు అనే విషయం పట్ల ఇంకా సరైన క్లారిటీ అయితే రావడం లేదు.కానీ లో లోపలి మాత్రం భారీ చర్చలైతే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు చిరంజీవి చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?
Advertisement

తాజా వార్తలు