ఖరీదైన ఏరియాలో చిరంజీవికి మూడు ఫామ్‌హౌస్‌లు.. వాటి ధర తెలిస్తే..?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాడు.

బ్రేక్ డ్యాన్స్‌లు, ఇంటెన్స్ యాక్షన్ ఫైట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చేశాడు.

పెద్ద పెద్ద హిట్స్ సాధిస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.కామెడీ, ఎమోషనల్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జానర్లను టచ్ చేశాడు.40 ఏళ్ల కెరీర్‌లో 150కు పైగా సినిమాల్లో నటించి మెగాస్టార్ అయిపోయాడు.చిరంజీవి 1990 కాలంలోనే కోట్లలో పారితోషికం తీసుకునేవాడు.

ఇండియా వైడ్ గా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడిగా కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు.ఓ ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ చిరంజీవి ముఖచిత్రంతో ఆయన పారితోషికం గురించి ఒక స్పెషల్ స్టోరీ కూడా ప్రచురించింది.

గ్యాంగ్ లీడర్( Gang Leader ) తర్వాత చిరంజీవి ఒక్కో సినిమాకు రూ.1.25 కోట్లు చార్జి చేస్తున్నాడని అది తెలిపింది.అప్పట్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్ కంటే ఇది ఎక్కువ.

Advertisement

అప్పటినుంచి చిరంజీవి సినిమాల ద్వారా బాగానే డబ్బు సంపాదిస్తూ చాలా రిచ్ యాక్టర్ అయిపోయాడు.సంపాదించిన మొత్తంలో కొంత దానధర్మాలు కూడా చేసేవాడు.ఈ మెగాస్టార్‌కి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో సిటీలలో చాలా స్థిరాస్తులున్నాయట.

జూబ్లీహిల్స్‌లో చిరుకి చాలా కోట్ల విలువైన బంగ్లా ఉందని మీడియా రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.ఇక ఆయనకు కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి.

ఈ హీరో ఓ చార్టెడ్ ఫ్లైట్ కూడా కొనుగోలు చేశాడు.

చిరంజీవి ఈ వయసులో కూడా చాలా యాక్టివ్ గా తన ఆస్తులు పెంచుకుంటూ పోతున్నాడు.రీసెంట్ గా ఈ సీనియర్ హీరో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశాడు.అయితే ఆ ప్రాపర్టీ గురించిన సమాచారంతోపాటు చిరంజీవికి చెందిన ఇతర ఆస్తి వివరాలూ బయటకు వచ్చాయి.

ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?
ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?

బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, చిరంజీవికి మూడు ఫామ్‌హౌస్‌లు ఉండగా, వాటిలో ఒకటి బెంగళూరు శివార్లలో ఉంది.ఇంకొకటి కెంపె గౌడ విమానాశ్రమానికి సమీపంలో ఉన్న దేవనహళ్ళి ఏరియాలో ఉంది.

Advertisement

ఇది కొన్ని ఎకరాల్లో చాలా పెద్దగా ఉంటుందని సమాచారం.సంక్రాంతి పండుగ వస్తే చాలు మెగా కుటుంబ సభ్యులందరూ ఈ పెద్ద ఫామ్‌హౌస్‌కు వెళ్తుంటారని సమాచారం.అక్కడ ఉన్న రేట్లును బట్టి ఈ ఫామ్‌హౌస్‌ విలువ అక్షరాలా రూ.40 కోట్లు అని తెలుస్తోంది.చిరంజీవి చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లోని కోకాపేటలో భూములను కొనుగోలు చేశారు.

ఇక్కడ కూడా ఓ ఫామ్‌హౌస్‌ కట్టించుకున్నాడట. హైదరాబాద్( Hyderabad) సిటీలో కలవడం వల్ల ఇప్పుడు కోకాపేట భూముల ధరలకు రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ కోకాపేటలోనే చిరంజీవికి ఫామ్‌హౌస్ ఉండటం ఆయన అదృష్టం అని చెప్పుకోవచ్చు.ఈ హౌస్ మార్కెట్ వాల్యూ రూ.200 కోట్లు అట.ఒకవేళ దీన్ని బేరానికి పెడితే ఇంకా ఎక్కువ ధరకు అమ్ముడుపోవచ్చు.సైరా నరసింహారెడ్డి సినిమా సెట్స్ కోకాపేట ఫార్మ్ హౌస్‌లోనే ఏర్పాటు చేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

అవి అగ్ని ప్రమాదంలో చిక్కుకొని బూడిద అయ్యాయి.దీని గురించి వార్తలు వచ్చిన సమయంలోనే చిరంజీవి కోకాపేట ఫార్మ్ హౌస్ అందరి దృష్టిని ఆకర్షించింది.ఇకపోతే చిరు రూ.16 కోట్లు వెచ్చించి ఊటీలో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశాడు.ఇప్పుడు అక్కడ ఓ లగ్జరీఫార్మ్ హౌస్ కట్టించాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఆ హౌస్ కట్టించుకున్న తర్వాత సెలవుల్లో అక్కడే ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు