Chiranjeevi, Rajendra Prasad : మీకు తెలుసో లేదో… రాజేంద్రప్రసాద్ ని చిరంజీవి కాపీ కొట్టాడట?

తెలుగు ప్రజలకు మెగాస్టార్( Megastar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు తెరపై నేటికీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో ఎదురులేని కథానాయకుడు చిరంజీవి.

సిల్వర్ స్క్రీన్ మీద చిరు కనపడితే తెలుగు సినిమా ప్రేక్షకులు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు.మెగాస్టార్ సినిమా రిలీజ్ అయితే బ్లాక్ టిక్కెట్లు అమ్మే వాళ్ళకి ఇక పండగ రోజుగానే వుంటుంది.

ఎందుకంటే నెల జీతాన్ని ఒక్క రోజులనే సంపాదించేస్తారు మరి.గత 40 సంవత్సరాలుగా ఆయన సినీ కళామ తల్లి ఒడిలో ఉంటూ ఎన్నో సామజిక సేవ కార్యక్రమాలు( Social service programs ) కూడా చేస్తున్నాడు.అలాగే సినిమా పరిశ్రమకు ఎంతో మంది రావటానికి ఇన్స్పిరేషన్ కూడా ఆయనే.

ముఖ్యంగా డాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరి ఉన్న చిరంజీవి గురించి ఇక్కడ ఇపుడు ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.

Advertisement

విషయం ఏమిటంటే అటువంటి ఘన చరిత కలిగిన చిరంజీవి( Chiranjeevi ) తన తోటి నటుడికి చెందిన నటన యొక్క ఫార్ములాని కాపీ కొట్టి యాజ్ టీజ్ గా తన సినిమాల్లో ప్రదర్శించాడు అంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే.ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా చెప్పాడు మరి.మరి చిరంజీవి ఫాలో అయిన ఆ నటుడు ఎవరంటే నటుడు రాజేంద్రప్రసాద్ గారు.అవును, చిరంజీవి డాన్స్ లకి, ఫైట్స్ కి ఎంత మంది అభిమానులు ఉంటారో కామెడీకి కూడా అంతే మంది అభిమానులు ఉంటారు అనే సంగతి అందరికీ తెలిసినదే.

కామెడీని పండించే విషయంలో అగ్ర హీరో అయినటువంటి రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) అప్పట్లో స్ఫూర్తిగా నిలిచాడు.ఎలాగంటే చిరంజీవి కామెడీలో ఓవర్ డోస్ ఉండదు.ఆ ఓవర్ డోస్ లేకుండా కామెడీ ని పండించడం చిరు రాజేంద్రప్రసాద్ దగ్గరనుంచి నేర్చుకున్నాడట.

ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.

ఇక రాజేంద్రప్రసాద్ గారి గురించి ఇక్కడ ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.తన కెరీర్ మొత్తం కామెడీ సినిమాలనే చేసినా కూడా ఎప్పుడు ప్రేక్షకులకి బోర్ కొట్టని విధంగా ఆయా సినిమాలు అడేవి అంటే అది రాజేంద్ర ప్రసాద్ గొప్పతనం అని చెప్పవచ్చు.తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఉంటాయి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

మన దేశ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహారావు చాలా సందర్బల్లో తన అభిమాన హీరో గురించి ప్రస్తావన వచ్చినపుడు రాజేంద్రప్రసాద్ పేరు చెప్పేవారు.

Advertisement

అంతటి నటుడు మనందరి నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్.

తాజా వార్తలు