భోళా శంకర్ కి ఎన్నో మెరుగులు.. అయినా క్రియేట్ అవ్వని బజ్‌

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా రూపొంది ఆ మధ్య సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా సక్సెస్ తో ప్రస్తుతం చేస్తున్న భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

మెహర్‌ రమేష్( Mehar Ramesh ) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా కీలక పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది.

ఈ సినిమా లో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇన్ని మెరుగులు దిద్దుతున్నా కూడా సినిమా కు కావాల్సిన బజ్ క్రియేట్‌ అవ్వడం లేదు.

ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.ఆ మధ్య పోస్టర్‌ తో పాటు టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.అయినా కూడా ఇంకా ఏదో లోటు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

దర్శకుడు మెహర్‌ రమేష్ సినిమా అనగానే అభిమానులతో పాటు అంతా కూడా నిటూర్చుతున్నారు.గతంలో ఆయన చేసిన సినిమాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్‌ తో ఆయన చేసిన శక్తి సినిమా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే.అందుకే భోళా శంకర్‌ సినిమా విషయంలో చాలా మంది నమ్మకం కనబర్చడం లేదు.సినిమా విడుదల సమయంకు ట్రైలర్ మరియు పాటలు వచ్చి సినిమా స్థాయిని పెంచుతాయో చూడాలి.

భారీ ఎత్తున అంచనాలున్న సినిమా కు గాను ఇప్పటి వరకు భారీగా ఖర్చు చేశారు.కానీ సినిమా యొక్క ఫలితం విషయంలో ఉన్న అనుమానాల నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సినిమా కు బజ్‌ క్రియేట్‌ అయ్యేలా ఏదైనా వ్యూహాత్మకంగా ప్రమోషన్స్‌ చేయాల్సిన అవసరం ఉందని మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు