భోళా శంకర్ కి మళ్లీ మళ్లీ రిపేర్‌ లు.. ఇప్పట్లో పూర్తి అయ్యేనా బాసూ?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత వెంటనే భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ ఇప్పటి వరకు ఆ సినిమా కనీసం చిత్రీకరణ కూడా పూర్తి కాలేదు.

ఆ సినిమా తర్వాత ప్రారంభించిన గాడ్ ఫాదర్ మరియు వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.గాడ్ ఫాదర్ సినిమా పరవాలేదు అనిపించుకొనగా, వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది.

మెహర్‌ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా ఆలస్యానికి కారణం ఏంటి అనేది తెలియడం లేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా కు సంబంధించిన సన్నివేశాలను మళ్లీ మళ్లీ చిత్రీకరిస్తున్నారట.

Chiranjeevi Bhola Shankar Movie Re Shoot Mode , Acharya, Bhola Shankar,chiranjee

సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని ఉద్దేశం తో ప్రతి ఒక్క సన్నివేశం విషయం లో చాలా పట్టుదలగా వ్యవహరిస్తున్నారట.ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా తిరిగి ఆ సన్నివేశాలను మార్చడం లేదంటే స్క్రీన్ ప్లే మార్చడం చేస్తున్నారట.అందుకే ఇప్పటికే చాలా చిత్రీకరణ చేసి మళ్లీ మళ్లీ వాటిని తొలగిస్తున్నారట.

Advertisement
Chiranjeevi Bhola Shankar Movie Re Shoot Mode , Acharya, Bhola Shankar,Chiranjee

ఇంకెన్నాళ్లు చిత్రీకరణ సాగుతుంది అనేది తెలియడం లేదు.మొన్నటి వరకు ఆగస్టు లో సినిమా వస్తుందని మెగా కాంపౌండ్ నుండి ప్రచారం జరిగింది.

కానీ ఇప్పుడు మాత్రం దసరా కు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.కనీసం దసరా కి అయినా సినిమా ను విడుదల చేస్తారా లేదంటే మళ్ళీ సంక్రాంతి కి సినిమా ను విడుదల చేస్తామంటారా? అంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత కొన్నాళ్లుగా ఈ సినిమా కి సంబంధించిన అప్డేట్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్న కారణంగా ఆసక్తి మరియు అంచనాలు పెరిగాయి.

మరి ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలంటే విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు