తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ తన మాటలతో, డాన్సులతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.
ఒక వైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు వెండితెరపై సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.ఇప్పటికే సినిమాల్లో నటించి నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
అయితే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త గా నటించి తన నటనతో ఆకట్టుకుంది అనసూయ.
అంతే కాకుండా ఇటీవల సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమాలో మంగళం శ్రీను భార్యగా దాక్షాయిని పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇందులో అనసూయ తన గెటప్ తోనే సగం మార్కులు కొట్టేసింది.ఇక ఈ రెండు సినిమాలకు కూడా సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ఈ రెండు సినిమాలు విడుదల అయిన తరువాత అనసూయ సుకుమార్ కు సెంటిమెంట్ అయ్యింది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా సుకుమార్ తెరకెక్కించిన ఒక యాడ్ కూడా హిట్ అయింది.ఆ యాడ్ లో కూడా అనసూయ నటించడంతో సుకుమార్ కి నిజంగానే అనసూయ సెంటిమెంట్ అయ్యింది అని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా సుకుమార్ తన స్టైల్ లో చిరంజీవి, అనసూయ, కుష్బూ తో కలిసి ఒక యాడ్ ను చిత్రీకరించారు.
ఈ యాడ్ హిట్ అవడంతో సుకుమార్ కి అనసూయ నిజంగానే సెంటిమెంట్ అయ్యింది అని తెలుస్తోంది.అందువల్లే సుకుమార్ కూడా తన ప్రతి సినిమాలో అనసూయ కి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే అనసూయ, ఇప్పటికే చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy