ఆచార్య ప్రమోషన్‌ మొదలు పెట్టేది ఎప్పుడంటే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది.

సినిమా విడుదల తేది సరిగ్గా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యం లో ప్రమోషన్ కార్యక్రమాలపై చిత్ర యూనిట్ సభ్యులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ పూర్తి అయ్యి  చాలా నెలలు అవుతుంది.కరోనా మరియు ఇతరత్రా కారణాల వల్ల ఈ సినిమా కు సంబంధించిన విడుదల తేదీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు.

ఇప్పటికే ఈ సినిమా మూడు నాలుగు సార్లు వాయిదా వేయడం తో అభిమానులు చాలా అసంతృప్తిగా ఉన్నారు.ఎట్టకేలకు ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యం లో మరో సారి భారీగా అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా భారీ ఎత్తున ప్రమోషన్ చేయడం ద్వారా రికార్డు స్థాయి బిజినెస్ ను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు సరికొత్తగా ప్రమోషన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.ఇక ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను ఏప్రిల్ రెండో వారం లో మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నారు.

Advertisement

ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ లో ప్రస్తుతం రవితేజ మరియు కేథరిన్‌ తెర్సా కూడా పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది.

ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే చిరంజీవి జోడీ గా కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో కనిపించ బోతున్నాడు.ఆయనకు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమా లో కీలక పాత్రలో నటించింది.సంగీత మరి కొందరు సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే ఆచార్య స్థాయిని పెంచింది అనడంలో సందేహం లేదు.ఉగాదికి ఆచార్య నుండి కీలక అప్డేట్ వస్తుందని.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఉగాది నుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం కూడా ఉందని ఒక వర్గం ప్రేక్షకులు అభిప్రాయంతో ఉన్నారు.

Advertisement