ఆ విషయంలో చిరంజీవి కంటే ముందే విజయశాంతి రికార్డు సెట్ చేసింది..

నైంటీస్ లో చిరంజీవి, విజయశాంతి హవా ఓ రేంజిలో ఉండేది.వీరిద్దరు కలిసి నటించి ఏ సినిమా అయినా దుమ్మురేపేది.

వీరిద్దరు సుమారు పదేండ్ల పాటు స్టార్ యాక్టర్లుగా కొనసాగారు.18991లో గ్యాంగ్ లీడర్ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు.ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ రికార్డులన్నీ కొల్లగొట్టింది.

కొత్త రికార్డులను సెట్ చేసి పెట్టింది.అప్పట్లోనే ఘరానా మొగుడు సినిమాకు గాను చిరంజీవి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

ఈ సినిమా 198982లో విడుదల అయ్యింది.చిరంజీవి కోటి రూపాయలు తీసుకోవడం అదే మొదటి సారి.

చిరంజీవి కోటి రూపాయలు తీసుకున్న సమయంలో తెలుగులో తిరుగులేని స్టార్ డమ్ అనుభవిస్తున్నాడు.అయితే చిరంజీవి కంటే ముందే ఓ సినిమాకు విజయశాంతి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం.

Advertisement
Chiranjeevi And Vijayashanti One Crore Remunerations Details, Chiranjeevi, Vijay

ఒక హీరోయిన్ కోటి రూపాయలు తీసుకోవడం అప్పట్లో పెద్ద వార్త అయ్యింది.భారీ రెమ్యునరేషన్ తీసుకుని నటించిన సినిమా కర్తవ్యం.

ఏ ఎం రత్నం ఈ సినిమాకు నిర్మాతగా చేశాడు.ఇండియన్ ఫస్ట్ లేడీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Chiranjeevi And Vijayashanti One Crore Remunerations Details, Chiranjeevi, Vijay

విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో నటించింది.ఈ సినిమాలో నటనకు గాను తను తొలిసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.1990లో విడుదల అయిన కర్తవ్యం సినిమా సంచనల విజయం సాధించింది.కోటి రూపాయల బడ్జెడ్ తో సినిమా తెరకెక్కగా 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

దీంతో అప్పటి వరకు విజయశాంతికి పర్సనల్ మేకప్ మెన్ గా పనిచేసిన రత్నం ఆమెకు రెమ్యునరేషన్ గా కోటి రూపాయలు అందించాడు.

Chiranjeevi And Vijayashanti One Crore Remunerations Details, Chiranjeevi, Vijay
టాలీవుడ్ లో హీరోలు వకీల్ సాబ్ లుగా నటించిన సినిమాలేంటో తెలుసా..?

ఆ తర్వాత ఏడాది చిరంజీవి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు.అప్పట్లో వీరి రెమ్యునరేషన్ తెలుగు సినిమా పరిశ్రమలో ఓ హాట్ టాఫిక్ గా మారింది.ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో పాటు మెగాస్టార్ చిరంజీవి కోటికి తగ్గకుండా రెమ్యునరేషన్ పొందారు.

Advertisement

తాజా వార్తలు