వాకింగ్ వెళ్లే సందర్భంలో కొందరు తమ పెంపుడు కుక్కలను తీసుకెళ్తుంటారు.అయితే చైనాలోనూ చాలా మంది ఇలా పెంపుడు కుక్కలతో వాకింగ్‌కు వెళ్తున్నారు.
అయితే ఇక్కడే ఓ కిటుకు ఉంది.అవి రోబోటిక్ కుక్కలు.
ప్రస్తుతం చైనా( China 0లో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వెళ్తూ ఆ రోబోటిక్ కుక్కలను వారు తమతో పాటు తీసుకెళ్తున్నారు.
చైనా నగరాలలోని దాదాపు ప్రతి కాలనీలలో ఇవే కనిపిస్తున్నాయి.షాంఘై నివాసి అయిన వు జియాంగ్యు ఒక రోబోట్ కుక్కకు యజమాని.
మరియు తన ఖాళీ సమయంలో కుక్కతో కలిసి వాకింగ్‌కు వెళ్లడం ఒక సాధారణ దినచర్యగా మారింది.అతడే కాకుండా చాలా మంది ఇలా రోబోటిక్ కుక్కలతో( Robot dogs, ) సహవాసం చేస్తున్నారు.
షాంఘైలో, జుహుయ్ నదీతీరంలో కుక్కలతో వాకింగ్, జాగింగ్ ఎక్కువగా చేస్తుంటారు.డిసెంబర్ 2021లో ఒక రోజు, వూ తన రోబోట్ డాగ్‌ని మొదటిసారిగా అక్కడికి తీసుకెళ్లాలని ఎంచుకున్నాడు.
అలా వెళ్లగానే, రోబోటిక్ కుక్కను అక్కడి వారు ఆశ్చర్యంగా చూశారు.ఆ రోబోట్ కుక్కలను కలవడానికి తమ నిజమైన పెంపుడు కుక్కలను కూడా తీసుకువచ్చారు.
క్రమంగా ఈ రోబోటిక్ కుక్కల వినియోగం పెరుగుతూ వచ్చింది.ప్రస్తుతం నగరాలలో చాలా కాలనీల్లో ఇవి కనిపిస్తున్నాయి.
వు తన పెంపుడు రోబోట్ కుక్కను సైబర్‌డాగ్( Cyberdog ) అని పిలుస్తారు.ఇది ఫోన్‌లకు అత్యంత ప్రసిద్ధి చెందిన చైనీస్ కంపెనీ Xiaomi అభివృద్ధి చేసింది.
ఈ రోబోటిక్ కుక్కలు పరిగెత్తగలవు.
ఎడమ, కుడి వైపు మలుపులు తీసుకోగలవు.
ప్రజలను పలకరించగలవు.అంతేకాకుండా కరచాలనాలు కూడా చేస్తాయి.
ఇవి బ్యాక్‌ఫ్లిప్‌లను కూడా చేస్తాయి.ఈ రోబోటిక్ డాగ్‌కు తల భాగంలో కంపెనీలు కెమెరాలను అమర్చుతున్నాయి.
వీటి సాయంతో అవి తమ యజమానులను గుర్తు పడతాయి.వారి వాయిస్ కమాండ్‌ల ఆధారంగా ప్రతిస్పందిస్తాయి.
ఇవే కాకుండా తమ యజమాని కనిపించగానే సాధారణ కుక్కల మాదిరిగానే తోకలు ఊపుతాయి.భారత కరెన్సీలో వీటి ధర రూ.1.5 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటోంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy