వాటి సైజ్‌ పెరగాలంటే ఆ కొబ్బరి నీళ్లు తాగాలట.. వైరల్‌ అయిన చైనా కంపెనీ యాడ్‌

కమర్షియల్‌ యాడ్స్‌ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

క్రియేటివిటీకి కొత్త అర్థం చెబుతూ అద్బుతమైన థాట్స్‌తో జనాలను ఆకర్షించే విధంగా వివిధ కంపెనీలు తమ బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నాయి.

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కంపెనీలు పెద్ద ఎత్తున కమర్షియల్‌ యాడ్స్‌తో ముంచెత్తుతున్నాయి.కమర్షియల్‌ యాడ్స్‌ వల్ల ఉత్పత్తుల అమ్మకాలు ఖచ్చితంగా పెరుగుతాయనేది అందరి నమ్మకం, అది నిరూపితం అయ్యింది కూడా.

ఏ వస్తువును అయినా ప్రమోట్‌ చేస్తేనే జనాలు తీసుకునేందుకు ముందుకు వస్తారు.ముందుగా ఒక వస్తువు ఉంది అనే విషయం తెలియాలి, ఆ వస్తువు ఉపయోగాలు తెలియాల, మార్కెట్‌లో ఉన్న వస్తువులకు మా వస్తువు ఎంత తేడానో, ఉపయోగమో యాడ్స్‌ ద్వారా చూపించుకోవాలి.

కంపెనీల ఉత్పత్తులు విపరీతంగా పెంచుకునే ఉద్దేశ్యంతో కొన్ని సార్లు తప్పుడు ప్రకటనలు కూడా చేస్తూ ఉంటాయి.తాజాగా చైనాకు చెందిన ఒక కొబ్బరి నీళ్ల అమ్మకపు కంపెనీ తమ కొబ్బరి నీళ్లను మార్కెట్‌లో అత్యధికంగా ప్రవహింపజేసేందుకు వింత ప్లాన్‌ చేశారు.

Advertisement

అమ్మాయిలు ఎక్కువగా ఆశపడే హెవీ బ్రెస్ట్‌ను ఆశ చూపించిన కొబ్బరి నీళ్లు అమ్మేందుకు వారు సిద్దం అయ్యారు.సదరు కంపెనీ కోసం ఒక యాడ్‌ ఏజెన్సీ సెక్సి యాడ్‌ను చిత్రీకరించడం జరిగింది.

ఆ యాడ్‌లో ఒక అందమైన యువతి చిన్నగా ఉన్నప్పుడు తాగితే పెద్దగా అయ్యాయి అంటూ చెబుతుంది.

కొబ్బరి నీళ్ల యాడ్‌లో బ్రెస్ట్‌ను కాన్సెప్ట్‌ వాడటంపై విమర్శలు వస్తున్నాయి.కొబ్బరి నీళ్లు వాడితే అసలు బ్రెస్ట్‌ పెరగడం ఏంటీ అంటూ నెటిజన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దాంతో సదరు కంపెనీ తమ యాడ్‌ను వివరించేందుకు ప్రయత్నించింది.

తాము బ్రెస్ట్‌ అనలేదని, చిన్న అమ్మాయిలు తమ కొబ్బరి నీళ్లు తాగితే మంచి హైట్‌ పెరుగుతారు అంటూ చెప్పే ప్రయత్నం చేశాం, కాని అది కాస్త తప్పుడు అర్థం వచ్చిందని కంపెనీ వారు వివరణ ఇచ్చారు.అయితే కంపెనీ సేల్స్‌ మాత్రం పెంచుకోవడం కోసం ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేశారు అంటూ అంతా చెబుతున్నారు.

తుమ్మినప్పుడు కళ్లు మూసుకుంటాం ఎందుకు? కళ్లు తెరిచి తుమ్మితే అలా జరుగుతుందా??

ఇలాంటి చిల్లర యాడ్స్‌ గతంలో కూడా సదరు కంపెనీ చేసి విమర్శల పాలు అయ్యింది.ప్రతి ప్రొడెక్ట్‌ను కూడా సెక్సీ యాడ్స్‌తో మార్కెట్‌ చేయడం వీరి మార్కెటింగ్‌ స్టైల్‌.

Advertisement