ట్రెడిషనల్ డ్యాన్స్ తో అదరగొట్టిన ముఖ్యమంత్రి.. వీడియో వైరల్!

ఈరోజుల్లో భారతదేశంలోని ముఖ్యమంత్రులు డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయింది.అంత పెద్ద హోదాలో ఉన్న వారెలా డ్యాన్స్ చేస్తారని అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది ముఖ్యమంత్రులు కాలు కదుపుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ ముఖ్యమంత్రి ఏకంగా ప్రజలతో కలిసి అదరగొట్టే స్టెప్పులు వేశారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.వివరాల్లోకి వెళ్తే.

శుక్రవారం అంటే ఏప్రిల్ 22న అస్సామీ కమ్యూనిటీకి చెందిన ఇటానగర్‌లో బిహు ఫెస్టివల్ జరిగింది.ఈ పండుగ వేడుకలలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పాల్గొన్నారు.

Advertisement

అంతేకాదు, పండుగ జరుపుకుంటున్న ప్రజలతో కలిసి ట్రెడిషనల్ డ్యాన్స్ చేశారు.దీనికి సంబంధించిన వీడియోని స్వయానా ఆయనే ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

బిహు వేడుకలో పాల్గొనడం, బిహు నృత్య కదలికలను ప్రయత్నించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.వైరల్ అవుతున్న వీడియోలో పెమా ఖండూ తన డోలు మెడలో వేసుకుని దాన్ని వాయించడంతో పాటు ప్రజలతో కలిసి నాట్యం చేయడం మీరు చూడొచ్చు.

"నేను నివసించే ప్రాంతానికి సమీపంలో బిహు.పండుగ అద్భుతంగా జరిగింది.

ఈ పండుగలో నేను కూడా పాటిస్పేట్ చేశాను.ఈ పండుగ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మధ్య ఉన్న పురాతన సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?
Advertisement