రష్మిక లెగ్ గోల్డెన్ లెగ్.. ఛావా మూవీ తొలిరోజు కలెక్షన్లు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

విక్కీ కౌశల్ ,రష్మిక మందన( Vicky Kaushal, Rashmika Mandana ) కలిసి నటించిన తాజా చిత్రం ఛావా.

శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ఫిబ్రవరి 14న విడుదల అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.విడుదలైన మొదటి రోజే ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.

అలాగే అన్ని ప్రాంతాల్లోనూ మంచి వసూళ్ళని రాబట్టింది.ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే 5 లక్షల టికెట్స్‌తో హవా చూపిన ఈ హిస్టారికల్‌ ఫిల్మ్‌ తొలిరోజు రూ.31 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఏడాదిలో బాలీవుడ్‌ లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

Chhaava Movie First Day Collections, Chhaava, Chhaava Movie, First Day Collectio

ఇటీవల విడుదలైన అక్షయ్‌ కుమార్ స్కై ఫోర్స్‌ ( Akshay Kumar Sky Force )తొలిరోజు రూ.15.30 కోట్లు వసూలు చేసి ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉండగా తాజాగా ఛావా సినిమా ఆ రికార్డును బద్దలు కొడుతూ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది.విక్కీ కౌశల్‌ కెరీర్‌ లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్‌ రాబట్టిన చిత్రంగా ఛావా మూవీ నిలిచింది.

Advertisement
Chhaava Movie First Day Collections, Chhaava, Chhaava Movie, First Day Collectio

ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించడంతోపాటు కలెక్షన్లు కురిపించడంతో సోషల్ మీడియా వేదికగా విమర్శకులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అభిమానులు మూవీ మేకర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Chhaava Movie First Day Collections, Chhaava, Chhaava Movie, First Day Collectio

ఈ సినిమా మంచి కలెక్షన్ లు సాధించడంతో రష్మిక గోల్డెన్ లెగ్ ( Golden Leg )అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.ఇటీవల కాలంలో రష్మిక ఏ సినిమాలో నటించిన ఆ సినిమా మంచి విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే.దాంతో అభిమానులు గోల్డెన్ లెగ్ అంటూ ఈమెఫై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సినిమా కంటే ముందు రష్మిక మందన అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 18 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి బాహుబలి లాంటి సినిమా రికార్డులను సైతం బద్దలు కొట్టింది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు