అందమైన ఆర్ట్‌గా మారిన ఊతప్పం.. ఈ వీడియో చూస్తే ఫిదా..

వంటకాలను చాలా అందంగా తీర్చిదిద్దతూ చెఫ్స్‌ మనల్ని ఎంతో ఆకట్టుకుంటుంటారు.కళాకారులు కూడా అప్పుడప్పుడు వంటకాలను డెకరేట్ చేసి వావ్ అనిపిస్తుంటారు.

తాజాగా ఢిల్లీకి చెందిన చెఫ్ సురభి సెహగల్( Chef Surabhi Sehgal ) సౌత్ ఇండియన్ పాపులర్‌ టిఫిన్ అయిన ఊతప్పాన్ని( Uthappam ) తన ఆర్టిస్టిక్ స్కిల్స్ తో చాలా అందంగా మార్చి ఆశ్చర్యపరిచింది.ఆమె బేబీ కార్న్, పచ్చి ఉల్లిపాయలు, బెండకాయ, ఊరగాయ ఉల్లిపాయలు, ఆవాలు మైక్రోగ్రీన్‌లను ఉపయోగించి ఉత్తపం పిండిపై అందమైన ఫ్లవర్ డిజైన్‌ను రూపొందించింది.

ఆమె దానిని తవా మీద ఉడికించి, బీట్‌రూట్ చట్నీతో అందించింది.ఆమె తన క్రియేటివ్ వీడియోను, ఫైనల్ రిజల్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఇది ఇప్పటివరకు తనకు ఇష్టమైనది అని పేర్కొంది.

ఈ వీడియో వైరల్‌గా మారగా 3 లక్షలకు పైగా వ్యూస్, వచ్చాయి.చూడగానే ఆకట్టుకునేలా వంట చేయడంలో ఆమె ప్రతిభను, నైపుణ్యాన్ని పలువురు మెచ్చుకున్నారు.కచ్చితత్వం, కళను( Art ) ఇష్టపడుతున్నామని, దీన్ని 5 మంది కుటుంబ సభ్యుల కోసం తయారు చేయవలసి వస్తే, ఒక్కో ముక్కకు ఎంత టైమ్ పడుతుంది? అని యూజర్ కామెంట్ సెక్షన్ లో ప్రశ్నించారు.ఇంత అందమైన ఆర్ట్ చెడగొట్టి తినేంత మనసు తనకి రాదని ఇంకొకరు అన్నారు.

Advertisement

ఊతప్పం ఆర్ట్( Uthappam Art ) ఒక ఫాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీలా కనిపిస్తోందని ఇంకొకరు పేర్కొన్నారు.

సెహగల్ ప్రత్యేకమైన ఆర్ట్ వెనుక ఆమె స్ఫూర్తిని పంచుకుంది.మార్కెట్‌లో సన్నటి కాండం ఉన్న కొన్ని ఉల్లిపాయలు దొరికాయని, వాటిని డిష్‌లో ఉపయోగించాలని అనుకున్నానని ఆమె చెప్పింది.ఆమె తన ఫుడ్ స్టైలింగ్‌ను పెయింటింగ్‌తో పోల్చింది, కొత్త, అందంగా చేయడానికి వివిధ పదార్థాలతో ప్రయోగాలు చేశానని చెప్పింది.

సెహగల్ తన ఆర్టిస్టిక్ వంటకాలతో అభిమానులను ఆకట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు.ఆమె గతంలో తన ఇడ్లీ తయారీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది, ఇది ఆన్‌లైన్‌లో కూడా చాలా దృష్టిని ఆకర్షించింది.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?
Advertisement

తాజా వార్తలు