రూపాయి ఖర్చు లేకుండా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!

జుట్టు రాలడం( Hairfall ) అనేది దాదాపు అందరూ ఎదుర్కొనే కామెంట్ సమస్య.అయితే కొందరిలో హెయిర్ ఫాల్ తక్కువగా ఉంటే.

మరికొందరిలో చాలా అధికంగా ఉంటుంది.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేసుకోవడం కోసం ఖరీదైన హెయిర్ ఆయిల్, షాంపూ, సీరం తదితర ఉత్పత్తులు వాడుతుంటారు.

అయితే రూపాయి ఖర్చు లేకుండా మన వంట గదిలో ఉండే పదార్థాలతో ఈజీగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా? అందుకు రెండే రెండు పదార్థాలు ఉపయోగపడతాయి.ఒకటి ఉల్లిపాయ( Onion ) కాగా.

మరొకటి కాఫీ పౌడర్.( Coffee Powder )

Advertisement

ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఈ ఉల్లిపాయ జ్యూస్ లో వన్ టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తే ఒక మంచి హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.

ఈ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకుని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ఉల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు తలకు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను పెంచుతాయి.జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.ఉల్లిలో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్ల‌ను శక్తివంతం చేసి, కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

అలాగే ఉల్లి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.ఇక కాఫీ పౌడ‌ర్ లోని యాంటీఆక్సిడెంట్లు, న్యూట్రియెంట్లు హెయిర్ ఫాల్ కు స‌మ‌ర్థ‌వంతంగా చెక్ పెడ‌తాయి.

Advertisement

పైగా కాఫీ జుట్టును సిల్కీగా, షైనీగా మారుస్తుంది.జుట్టు పెరుగుదలను ప్రోత్స‌హిస్తుంది.

తెల్ల జ‌ట్టు త్వ‌ర‌గా రాకుండా అడ్డుకుంటుంది.ఉల్లి-కాఫీ కాంబినేష‌న్ హెయిర్ ఫాల్‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి మంచి ఎంపిక అవుతుంది.

తాజా వార్తలు