రోజ్ వాటర్'తో చుండ్రుకు చెక్.. ఎలా అంటే?

ప్రతి ఒక్క అమ్మాయి ఎంతో అందంగా కనిపించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అందులో భాగంగానే మార్కెట్లో లభించే ప్రతి ఒక్క ఫేస్ ప్రొడక్టులను వాడుతూ ఉంటారు.

అందం మీద మక్కువ ఉన్న అమ్మాయిల ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ రోజ్ వాటర్ తప్పనిసరిగా ఉంటుంది.మార్కెట్లో లభించే ఈ ప్రొడక్ట్స్ అధిక రసాయనాలతో తయారు అవుతాయి కాబట్టి కొందరి చర్మానికి సరిపడవు.

Check For Dandruff With Rose Water How It Is That Rose Water, Beauty, Hair,dand

అలాంటి వారు ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వాటితో తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే ఎంత అందంగా ఉన్నప్పటికీ వారికి జుట్టు లేకపోతే ఎంతో అందవిహీనంగా కనిపిస్తుంటారు.

ఎంతోమంది అనేక జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు.అందులో చుండ్రు ప్రతి ఒక్కరిని వేధించే అతి పెద్ద సమస్య, ఈ చుండ్రు తగ్గాలంటే రోజ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది.

Advertisement

రోజ్ వాటర్ ని ఏ విధంగా వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గిపోతాయో ఇక్కడ తెలుసుకుందాం.చాలామందిలో వాతావరణ కాలుష్యం వల్ల లేదా నీటి ప్రభావం వల్ల తరుచూ చుండ్రు ఏర్పడడం జరుగుతుంది.

ఈ చుండ్రుతో జుట్టు రాలిపోవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి.అలాంటి వారు తలస్నానం చేసిన తర్వాత ఒక మగ్ నీటిలోకి కొద్దిగా రోజ్ వాటర్ ను కలిపి ఆ నీటిని మన తల కుదుళ్లకు అంటేలా బాగా పట్టించుకోవాలి.

ఇలా తరచూ చేయడం ద్వారా తలలోని చుండ్రు సమస్యను తగ్గడమే కాకుండా, జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి.అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

మరి కొంతమంది అమ్మాయిలలో తలలో చుండ్రు ఏర్పడటంవల్ల చుండ్రు మొహానికి అంటుకోవటం ద్వారా మొహం మీద మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి.అలాంటి వారు రోజ్ వాటర్ లో కాటన్ బాల్స్ ముంచి మన ఫేస్ మీద బాగా రుద్దడం వల్ల మన చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్, దుమ్ము ధూళి కణాలను సైతం తొలగిస్తుంది.

పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఆ సమయంలో అస్సలు తినకూడదు తెలుసా?

అంతే కాకుండా మొటిమలు మచ్చలు కూడా తగ్గుముఖం పట్టడమే కాకుండా, మన చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన కళ్ళ కింద ఏర్పడినటువంటి నల్లటి వలయాలను సైతం తగ్గిస్తాయి.

Advertisement

ఎంతో సులభంగా దొరికే ఈ రోజ్ వాటర్ ను ప్రతిరోజు వాడటం వల్ల చర్మంతోపాటు, ఎటువంటి జుట్టు సమస్యలు కూడా ఉండవు.

తాజా వార్తలు