ఏథర్ స్మార్ట్ హెల్మెట్ తో ప్రమాదాలకు చెక్.. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే..?

వాహనాలలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ముఖ్యంగా హెల్మెట్ ( Helmet )లేకుండా డ్రైవ్ చేయడం వల్ల ఏవైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణప్రదమైన నష్టాలే ఎక్కువ.

రోడ్డు ప్రమాదాలు మనుషుల జీవితాలను సైతం తలకిందులు చేసేస్తాయి.

అయితే కొంతమంది హెల్మెట్ ధరిస్తే జుట్టు ఉడిపోతుందని, చమట పడుతుందని, హెల్మెట్ అంత కంఫర్ట్ గా ఉండదని సాకులు చెబుతూ హెల్మెట్ ధరించరు.కానీ ఏథర్ స్మార్ట్ హెల్మెట్( Ather smart helmet ) యొక్క అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్లు చూస్తే ఖచ్చితంగా ఈ హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తారు.

స్టైలిష్, స్టన్నింగ్ లుక్స్, కంఫర్టబుల్ గా ఉండే ఈ హెల్మెట్ ధర మరియు స్పెసిఫికేషను వివరాలు తెలుసుకుందాం.

Check Accidents With Aether Smart Helmet.. What Features Are There, Check Acci

ఏథర్ నుంచి ఇటీవలే ఏథర్ హలో, ఏథర్ బిట్ ( Aether bit smart helmet )అనే రెండు రకాల హెల్మెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది.ఏథర్ హలో హెల్మెట్ ఫుల్ హెల్మెట్ కాగా.ఏథర్ బిట్ హఫ్ హెల్మెట్ గా డిజైన్ చేశారు.

Advertisement
Check Accidents With Aether Smart Helmet.. What Features Are There, Check Acci

ఈ స్మార్ట్ హెల్మెట్స్ డిజైన్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.ఈ హెల్మెట్లలో ఇన్ బిల్డ్ సౌండ్ సిస్టం ఉంటుంది.

డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ హెల్మెట్ ను స్కూటర్ కి, స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేయొచ్చు.డ్రైవింగ్ చేస్తూ పాటలు కూడా వినొచ్చు.

ఈ హెల్మెట్ ధరించి కాల్స్ మాట్లాడితే.ట్రాఫిక్ నాయిస్ కూడా చాలా వరకు తగ్గుతుంది.

ఏథర్ హలో హెల్మెట్ వైర్ లెస్ ఛార్జింగ్ సిస్టమ్ తో వస్తుంది.రిజ్తా బండి ఉన్నవాళ్లు అయితే డిక్కీలోనే వైర్ లెస్ చార్జింగ్ పెట్టుకోవచ్చు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

హఫ్ హెల్మెట్ బిట్ మాత్రం టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

Check Accidents With Aether Smart Helmet.. What Features Are There, Check Acci
Advertisement

ఈ హెల్మెట్ ను ఒకసారి చార్జింగ్ చేస్తే వారం వరకు పనిచేస్తుంది.ఈ హెల్మెట్ల ధరల విషయానికి వస్తే.ఏథర్ హాలో ధర రూ.14999 గా ఉంది.అయితే ఆఫర్ కింద రూ.12999 కే కొనుగోలు చేయవచ్చు.హఫ్ హెల్మెట్ బిట్ ధర రూ.4999 గా ఉంది.ఈ హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని ఏథర్ కంపెనీ స్మార్ట్ హెల్మెట్స్ చెబుతోంది.

తాజా వార్తలు