బాబోయ్‌... చిరు మూవీ షూటింగ్ కు వెళ్లినా కూడా పూరి ఆమెను వదలడం లేదుగా!

ఈమద్య కాలంలో పూరి జగన్నాద్‌ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఛార్మి కనిపిస్తున్న విషయం తెల్సిందే.

ఆయన సొంత నిర్మాణ సంస్థ యొక్క పూర్తి బాధ్యతలను ఛార్మి చూసుకుంటున్నారు.

లైగర్ సహా ఇంతకు ముందు సినిమా నిర్మాణ వ్యవహారాలు మరియు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరి తెరకెక్కిస్తున్న సినిమాను కూడా స్వయంగా ఛార్మి నిర్మిస్తున్న విషయం తెల్సిందే.అది కూడా పూరి యొక్క బ్యానర్‌ లోనే ఆమె నిర్మిస్తుంది.

ఛార్మి కి ఇప్పటికి కూడా ఐటెం సాంగ్స్ లేదా ఏదో ఒక సినిమాలో కీలక పాత్రల్లో ఆఫర్లు వస్తాయి.ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు.

అయినా కూడా ఆమె నటనపై ఆసక్తి చూపించకుండా పెద్దగా ఇంట్రెస్ట్‌ లేనట్లుగానే వ్యవహరిస్తుంది.కాని పూరి చేస్తున్న ప్రతి సినిమా నిర్మాణ వ్యవహారం మరియు ఇతర విషయాల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

కేవలం నిర్మాతగానే కాకుండా ప్రొడక్షన్ మేనేజర్‌ నుండి డైరెక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌ వరకు ప్రతి ఒక్క విభాగాన్ని ఆమె చూసుకుంటుంది.

ఇంత హడావుడి ఆమె చేయడం ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కొందరు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.అసలు విషయం ఏంటో అనేది తెలియదు.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా చిరంజీవి నటిస్తున్న గాడ్‌ ఫాదర్ సినిమా లో ఒక చిన్న గెస్ట్ రోల్‌ కోసం పూరిని ఎంపిక చేయడం జరిగింది.ఆ సన్నివేశాల చిత్రీకరణ నేడు జరుగుతుంది.

సీనియర్ జర్నలిస్ట్‌ గా పూరి గాడ్‌ ఫాదర్ లో కనిపించబోతున్నాడట.ఆ సన్నివేశాల చిత్రీకరణ కు నేడు చిరంజీవితో షూటింగ్‌ లో జాయిన్ అయ్యాడు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

అక్కడ కూడా ఛార్మి ప్రత్యక్ష్యం అవ్వడం చర్చనీయాంశంగా మారింది.పూరి సినిమాలు అంటే ఛార్మి ఉంది అనుకోవచ్చు.

Advertisement

చిరంజీవి సినిమాలో పూరి కనిపించే సన్నివేశాల చిత్రీకరణ కోసం కూడా ఆమె ఆయన పక్కన రావాలా అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.అస్సలు పూరి ఆమెను వదలక పోవడంకు కారణం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇద్దరి మద్య మంచి స్నేహంను కొందరు అపార్థం చేసుకుంటున్నారంటూ ఈ సమయంలో కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతున్నారు.అసలు విషయం ఏంటీ అనేది వాళ్లకే తెలియాలి.