ఆ ఇద్దరిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్న విధేయ రాముడు

రామ్‌ చరణ్‌, బోయపాటిల కాంబినేషన్‌లో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రంగస్థలం వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తర్వాత రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు బోయపాటితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు ప్రీ రిలీజ్‌ వేడుకను భారీగా నిర్వహించాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు.

ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక వైజాగ్‌లో జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథులుగా రాజమౌళి మరియు ఎన్టీఆర్‌లు హాజరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసి మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.అది దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతుంది.ఇక వినయ విధేయ రామ చిత్రం కూడా దానయ్య నిర్మిస్తున్నాడు.

Advertisement

కనుక రామ్‌ చరణ్‌ సినిమా కోసం జక్కన్న, ఎన్టీఆర్‌లు కూడా వచ్చేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా దానయ్య ప్రకటించాడు.అయితే ప్రీ రిలీజ్‌ వేడుక గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి విజేతగా నిలవడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.బోయపాటి శ్రీను ఈ చిత్రంలో చరణ్‌లోని కొత్త యాంగిల్‌ను చూపించి ఉంటాడని అంతా నమ్ముతున్నారు.

తాజా వార్తలు