ఈరోజు నుంచి శ్రీవారి సేవలలో మార్పులు.. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిందే..

మన దేశం వ్యాప్తంగా చాలామంది ప్రజలు ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు.

అలాంటివారు శ్రీవారి సేవలలో చేసిన మార్పుల గురించి కచ్చితంగా తెలుసుకుని వెళ్లడం మంచిది.

తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నారు.ఈరోజు సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభం అవ్వడం వల్ల సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై తో స్వామివారికి మేల్కొలుపు చేయనున్నారు.

ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో సాధారణ భక్తులకు వెలుసుబాటు కలుగుతుందని చాలామంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు సంక్రాంతి వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టిటిడి ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేస్తుంది.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషముల నుండి ధనుర్మాస ఘడియలు మొదలుకానున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించే అవకాశం ఉంది.రేపటి నుంచి 14 వరకు తిరుప్పావై పఠనం జరిగే అవకాశం ఉంది.

Advertisement
Changes In The Services Of Shrivari From Today Devotees Who Go For Darshan Of Sh

ఈరోజు స్వామివారి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

తిరుమల శ్రీవారిని 63 వేల 600 మంది భక్తులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారని సమాచారం.అంతేకాకుండా శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు 4.13 కోట్లు వచ్చినట్లు టిటిడి వెల్లడించింది.శ్రీవారికి దాదాపుగా 20,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Changes In The Services Of Shrivari From Today Devotees Who Go For Darshan Of Sh

కొత్త సంవత్సరం ప్రారంభం కానుండడంతో జనవరి 1న విఐపిల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.దీంతో ప్రోటోకాల్ జాబితాలో ఉన్న ప్రముఖులు వస్తే వారికి బ్రేక్ దర్శనం అవకాశం ఇవ్వాలని సిఫారసులు లేఖల ద్వారా బ్రేక్ దర్శనాలు నిలిపివేయాలని టీటీడీ నిర్వహించింది.అదేవిధంగా జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తిరుమల లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రత్యేకంగా కౌంటర్లలను ఏర్పాటు చేశారు.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?
Advertisement

తాజా వార్తలు