ఆ రూల్ వెంటనే మార్చండి.. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి

తెలుగు క్రీడాభిమాని గర్వించదగిన పేరులలో హనుమ విహారి పేరు ఒకటి.

భారత టెస్ట్ క్రికెట్ జట్టులో విశ్వసనీయమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన విహారి, దేశవాళీ క్రికెట్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తన ఆటతీరుతోనే కాకుండా, మైదానంలో వెలుపల సంఘటనలపై తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.తాజాగా క్రికెట్ నిబంధనలపై హనుమ విహారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

గత రాత్రి వాంఖడే వేదికగా జరిగిన ముంబయి ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు డిబేట్‌గా మారింది.ఆర్సీబీ బ్యాట్స్‌మన్ జితేశ్ శర్మ ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ కొట్టి, ఆ తర్వాత యార్కర్‌పై ఎల్బీ డబ్ల్యూకు అంపైర్ ఔట్ ఇచ్చాడు.

వెంటనే బ్యాటర్లు పరుగు తీశారు.అయితే జితేశ్‌ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు.

Advertisement
Change That Rule Immediately.. Andhra Cricketer Hanuma Vihari, Hanuma Vihari, MI

సమీక్షలో నాటౌట్‌గా తేలింది.అయితే, అప్పటికే బంతిని ‘డెడ్ బాల్’గా పరిగణించిన అంపైర్, బ్యాటర్లు తీసిన పరుగు లెక్కలోకి తీసుకోలేదు.

Change That Rule Immediately.. Andhra Cricketer Hanuma Vihari, Hanuma Vihari, Mi

ఈ ఘటనపై హనుమ విహారి (Hanuma Vihari)సోషల్ మీడియా వేదికగా స్పందించాడు."క్రికెట్‌లో ఓ రూల్‌ను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపాడు.ఆర్సీబీ ఇన్నింగ్స్‌ చివరి బంతికి జితేశ్ శర్మ(Jitesh Sharma) ఔట్‌గా ప్రకటించారు.

అతడు రివ్యూ తీసుకుని, అది నాటౌట్‌గా తేలింది.అయినా, బ్యాటర్లు తీసిన పరుగును లెక్కలోకి తీసుకోలేదు.

ఒకవేళ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చి ఉంటే ఆ పరుగులు కౌంట్ అయ్యేవి.ఇప్పుడది మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయలేదేమో కానీ, ఈ ఘటన రెండో ఇన్నింగ్స్‌లో జరిగి ఉంటే? ఒక్క పరుగే మ్యాచ్‌ను మార్చేస్తుంది.అందుకే ఈ రూల్‌లో మార్పు అవసరం" అంటూ విహారి అభిప్రాయాన్ని తెలిపాడు.

Change That Rule Immediately.. Andhra Cricketer Hanuma Vihari, Hanuma Vihari, Mi
కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే

విహారి చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పలువురు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు అతడి అభిప్రాయానికి మద్దతు తెలుపుతున్నారు.కొందరైతే ఈ అంశంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు.

Advertisement

మొత్తానికి, క్రికెట్ ఆట నిత్యం అభివృద్ధి చెందుతున్న ఒక క్రీడ.పాత నిబంధనలపై నూతన ఆలోచనలు రావాల్సిన అవసరం ఉందన్న విహారి అభిప్రాయం ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి ఆలోచనలో పడేస్తోంది.

తాజా వార్తలు