గోదావరి జిల్లాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పు ! ఎవరెక్కడో తేలేది నేడే ? 

వచ్చే ఎన్నికల్లో వైసీపీ( ycp ) తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబుతాను విడతల వారీగా విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్ణయించుకున్నారు.

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 90% మందిని మార్చే ఆలోచనతో ఉన్నారు.

ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించారు.జిల్లాల వారీగా రెండో జాబితాను విడుదల చేసినందుకు కసరత్తు చేస్తున్నారు .ఇప్పటికే టికెట్ దక్కి అవకాశం లేదనుకున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని జగన్ వారికి ఈ విషయాన్ని చెబుతున్నారు.దీంతో క్యాంపు కార్యాలయం వద్ద హడావుడి నెలకొంది.

టికెట్ పై టెన్షన్ గా ఉన్న నేతలు జగన్ కలిసేందుకు క్యూ కట్టేస్తున్నారు.జగన్ నుంచి పిలుపు అందుకున్న వారు, అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారు , ఇలా అంతా తాడేపల్లి లో వాలిపోతున్నారు.

ఇది ఇలా ఉంటే వైసీపీకి 2019 ఎన్నికల్లో అండగా నిలిచిన ఉభయగోదావరి జిల్లాల్లో ఏఏ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది .

Change Of Ycp In-charges In Godavari Districts Is This The One Who Floats Somew
Advertisement
Change Of YCP In-charges In Godavari Districts! Is This The One Who Floats Somew

ఈ రెండు జిల్లాల్లో వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేది జగన్ సర్వే నివేదికలు తెప్పించుకున్నారు.దీనికి అనుగుణంగా మార్పులు,  చేపట్టేందుకు సిద్ధమయ్యారు.ఈరోజు సాయంత్రానికి ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలకు నియోజకవర్గ ఇన్చార్జిల జాబితాను జగన్ ప్రకటించే అవకాశం ఉంది.

ఈ రెండు జిల్లాల్లో టిడిపి , జనసేన( TDP, Jana Sena ) ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అనే సర్వే నివేదికలతో అలర్ట్ అవుతున్న జగన్ కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల సమీకరణను ప్రాతిపదికగా తీసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి,  వారి స్థానంలో కొత్తవారిని నియమించే ఆలోచనతో ఉన్నారు .ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లు ఇవేనంటూ హడావుడి జరుగుతోంది.ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట, ఉండి, నరసాపురం, భీమవరం, ఏలూరు చింతలపూడి పోలవరం, కొవ్వూరు, గోపాలపురం తదితర నియోజకవర్గాల లో మార్పులు తప్పవు అనే ప్రచారం జరుగుతుంది.

Change Of Ycp In-charges In Godavari Districts Is This The One Who Floats Somew

ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని భారీగా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.ముఖ్యంగా రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్( Bharath ) కు ఈసారి  అసెంబ్లీ సీటు అలాగే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు రామచంద్రపురం, కేటాయించే అవకాశం ఉందట .ఇక అమలాపురం, కొత్తపేట, తదితర నియోజకవర్గాల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందట.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు