స్కిల్ డెవలప్‎మెంట్ స్కాం కేసులో తొలిరోజు ముగిసిన చంద్రబాబు విచారణ కస్టడీ

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది.

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును విచారించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఇచ్చిన సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ తరువాత మళ్లీ ప్రశ్నించారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో నిధుల దుర్వినియోగంపై ఆయనను ప్రశ్నించారని తెలుస్తోంది.

Chandrababu's Trial In The Skill Development Scam Case Ended On The First Day In

షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై ఆరా తీసిన అధికారులు సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తో సమావేశాలపై కూడా చంద్రబాబును ప్రశ్నించారని సమాచారం.లాయర్ల సమక్షంలో చంద్రబాబు విచారణ కొనసాగగా.

రేపు కూడా సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు.

Advertisement
షాకింగ్ వీడియో : స్నాచర్‌ని నేలకూల్చిన మహిళ.. ఆ మూమెంట్ చూస్తే వావ్ అనాల్సిందే!

తాజా వార్తలు