Chandrababu Naidu: వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు.ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

కబ్జాలు గురించి ప్రశ్నించడం వల్లనే అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేసినట్లు ఆరోపించారు.పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తారా అంటూ కూడా సీరియస్ అయ్యారు.

Chandrababu Serious Comments On Ysrcp Party Jagan Details, Chandrababu, YSRCP P

భూదోపిడి కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్ ది.ఇడుపులపాయలో కొన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారు.అటువంటి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన జగన్ 0.02 సెంట్ల భూమి ఆక్రమణ ఆరోపణలతో అయ్యన్నపాత్రుడనీ అరెస్టు చేయించడం దుర్మార్గం.తప్పుడు పనులు చేయడానికే సీఎం పదవిలో జగన్ ఉన్నారు.

పోలీసులు కూడా చట్టపరంగా వ్యవహరించాలని చంద్రబాబు హెచ్చరించారు.అధికారం ఎవరికి శాశ్వతం కాదు.చట్టపరంగా నడుచుకోవాలి అని అధికారులకు తెలియజేయడం జరిగింది.

Advertisement

ఇదే సమయంలో బాబాయి హంతుకులను కాపాడేదెవరో జగన్ చెప్పాలి అని నిలదీశారు.ఏదో ఒక్కసారి అవకాశం ఇస్తే.ఆ ఒక్క  అవకాశంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.175 గెలుస్తావా అంటూ ప్రశ్నించారు.వచ్చే ఎన్నికలలో.

ఓడిపోయాక జగన్ పోయేది జైలుకు.వైసీపీ పార్టీ బంగాళాఖాతంలోకి కలిసిపోతుంది అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు