కక్ష సాధింపులకు పాల్పడవద్దు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) శనివారం కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ క్రమంలో కూటమి అధికారంలోకి రావడం కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఉంటాయని స్పష్టం చేశారు.

ఎవరు ఎక్కడ ఏం చేశారు చూసి పదవులు అప్పజెప్పడం జరుగుద్ది.నేతలు కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయి.

అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజా వ్యతిరేక పనులు చేయవద్దు.బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అదేవిధంగా అన్నా క్యాంటీన్లు( Anna Canteen ) ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వంద రోజుల్లోనే తెరిపించే కార్యక్రమం ఉంటుందన్నారు.గత 20 ఏళ్లలో ఎన్నడు గెలవని సీట్లలో కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి( TDP ) అధికారాన్ని కట్టబెట్టారంటే.అది వారు పెట్టుకున్న నమ్మకం అని పేర్కొన్నారు.

Advertisement

కూటమికి 93% స్ట్రైక్ రేట్, 57 శాతానికి పైగా ఓట్లు వచ్చిన విషయాన్ని.ఈ సందర్భంగా ప్రస్తావించటం జరిగింది.

కూటమిలోని మూడు పార్టీల పాత్ర గెలుపు విషయంలో కీలకంగా పని చేసిందని పేర్కొన్నారు.ఈ ఘన విజయానికి కారణమైన ప్రతి పార్టీ కార్యకర్త రుణం తప్పకుండా తీర్చుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

అదేవిధంగా ఎమ్మెల్యేలు.కిందిస్థాయి కార్యకర్తలను విస్మరించకూడదని హెచ్చరించారు.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 
Advertisement

తాజా వార్తలు