ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ( TDP ) ఎన్టీఆర్ భవన్ లో అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు జిల్లాకు చెందిన చాలామంది నాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు.

వీళ్లంతా వైసీపీ పార్టీకి చెందినవారే.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇలాంటి తరుణంలో చంద్రబాబు ముందస్తు ఎన్నికల వార్తలపై స్పందించారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్( CM Jagan ) ఏం సాధించారు చెప్పాలని డిమాండ్ చేశారు.ముందస్తు ఎన్నికలు అంటూ లీకులు ఇచ్చేది వీళ్లే.

మళ్లీ ఆ వార్తలను ఖండించేది కూడా వాళ్లే అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా జగన్ ఇంటికి వెళ్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.ఇదే సమయంలో పార్టీలో జాయిన్ అయినా వారికి వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలని సూచించారు.

పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని కోరారు.గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు సూచించడం జరిగింది.వైఎస్ జయంతి సందర్భంగా రేపు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ క్రమంలో అదే జిల్లాకు చెందిన వైసీపీ నేతలు నేడు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు