తాను ఎప్పటికీ యూత్ నే అంటున్న చంద్రబాబు!

ఇటీవల కాలంలో ప్రదాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై( Chandrababu Naidu ) వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల్లో ప్రధానమైనది చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారని, ఆయన తరహా రాజకీయాలకు కాలం చెల్లిందంటూ “ముసలాయన” అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా వైసిపి నాయకులు కౌంటర్ లు వేస్తుంటారు .ఈ వాఖ్యల పై తెలుగుదేశం నేతల నుంచి కౌంటర్ వస్తున్నప్పటికీ ఆ పార్టీ అధినేత ఇంతవరకు ఆ విషయంపై స్పందించలేదు అయితే నిన్న జరిగిన నంద్యాల( Nandyala ) సభ వేదికగా తన వయసు వైసిపి చేస్తున్న కామెంట్లకు భారీ ఎన్ కౌంటర్ ఇచ్చేశారు చంద్రబాబు.

మాట్లాడితే తన వయసు గురించి మాట్లాడుతున్న అదికార వైసిపి నాయకులు( YCP Leaders ) తాను పడుతున్నట్టు రోజుకు 18 గంటల పాటు కష్టపడగలరా అంటూ ఆయన సవాలు చేశారు.రాష్ట్రానికి కావలసింది సమర్ధుడైన నాయకుడని, సమర్థత గురించి ప్రశ్నించాలి తప్ప వయసు గురించి వీళ్లకు ఎందుకు అంటూ ఆయన నిలదీశారు .తాను రాజకీయాల్లో బ్రతికినంత కాలం సింహంలా బ్రతికానని ఎటువంటి మచ్చా లేని రాజకీయ జీవితాన్ని పొందానంటూ ఆయన గంభీరమైన ప్రకటన చేశారు .వచ్చే 20 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలో తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని రాష్ట్రాన్ని దోచుకునే ఆలోచనలు తాను జీవితం లో చేయనని నవ యువకులకు( Youth ) కూడా సాధ్యం కాని రీతిలో రోజుకు 18 గంటలు కష్టపడతానని ఇందులో కనీసం ఒక గంట కూడా తనలా బ్రతకలేని వారు తనను విమర్శించడం హాస్యాస్పదమంటూ ఆయన చెప్పుకొచ్చారు .

ఇక రౌడీ రాజకీయాలను ఉపేక్షించనని, అటువంటి వారి తాట తీస్తానని, నేను ఒకప్పటి చంద్రబాబును కాదని ఉపేక్షిస్తూ చూడనంటూ కూడా ఆయన ఘాటు సందేశం ఇచ్చారు.మిగతా విషయాలు ఎలా ఉన్న రాజకీయాల లో కష్టపడడం విషయం లో చంద్రబాబు మిగతా రాజకీయ నాయకులు కన్నా ఒక మెట్టు ముందే ఉంటారని ఆయన వ్యతిరేకులు కూడా ఒప్పుకుంటారని చెబుతారు .సమర్ధత విషయంలో తాను యువకులతో పోటీపడుతానని చెప్పే చంద్రబాబు తాను ఎప్పటికీ యువకుడినే నని సమర్ధతకు వయసు అడ్డంకే కాదని మరో మారు నిరూపించారు అంటూ తెలుగుదేశం శ్రేణులు( TDP ) వ్యాఖ్యానిస్తున్నాయి.మరి చంద్రబాబు వయసు గురించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు