'రచ్చ ' చేయాలని డిసైడ్ అయ్యారా బాబు ? 

టిడిపి అధినేత చంద్రబాబు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చెందుకు భారీగానే వ్యూహాలను రచిస్తున్నారు.

ఇంకా ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ.

పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, పాదయాత్రలతో టిడిపిని జనాలకు మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు.

త్వరలోనే లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభం కానుంది.ఇప్పటికే చంద్రబాబు జిల్లాలు , నియోజకవర్గ పర్యటనలు చేస్తుండగా,  ఇటీవల గుంటూరు , కందుకూరులలో చోటు చేసుకున్న విషాద ఘటనలతో బాబు పొలిటికల్ టూర్ లకు కాస్త బ్రేక్ లు పడేలా చేశాయి.

దీనిని సాకగా చూపించి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటిని తెరపైకి తీసుకువచ్చింది.   

Advertisement

  దీని ద్వారా రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు చేయకుండా నిషేధం విధించారు.అయినా చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రయత్నాలు చేయగా,  పోలీసులు దానిని అడ్డుకున్నారు.ఈ సందర్భంగా టిడిపి క్యాడర్ లోను ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు కనిపించాయి.

ఇక సామాన్య జనంలోనూ సానుభూతి పెరిగినట్టు చంద్రబాబు గ్రహించారు  దీంతో ఇక జిల్లాల్లో పర్యటనలు చేయాలని,  కీలకమైన నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని , ఒకవేళ పోలీసులు తన సభలను సమావేశాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తేmm ప్రజల నుంచే తనకు సానుభూతి పెరుగుతుందని,  అది టిడిపికి రాబోయే ఎన్నికల్లో మేలు చేస్తుందని బాబు బలంగా నమ్ముతున్నారు.ఈ సంక్రాంతి పండుగ ముగిసిన అనంతరం ఇక జిల్లాల వారీగా వరుస వరుసగా పర్యటనలు చేసేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నారు .తన పర్యటనను పోలీసులు అడ్డుకుంటే దాని పార్టీ క్యాడర్ ద్వారా తిప్పి కొట్టే ప్రయత్నం చేయాలని, అక్కడ పై చేయి సాధించినా,  సాధించలేకపోయిన జనాల్లో మాత్రం సానుభూతి విపరీతంగా పెరుగుతుందని , అది ఎన్నికల్లో విజయానికి దోహదం చేస్తుంది అని బాబు అంచనా వేస్తున్నారు.   

  తమ బలం పెంచుకోవడం ద్వారా , మిత్రపక్షలను తమకు దగ్గర చేసుకోవచ్చనే వ్యూహంతో ఉన్నారు.త్వరలోనే రాయలసీమ జిల్లాల్లోనూ,  అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ పర్యటించేందుకు బాబు సిద్ధమవుతున్నారు  మరి బాబు పర్యటన విషయంలో వైసిపి ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉండబోతుందో.?.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు
Advertisement

తాజా వార్తలు