Chandrababu, Pawan : వచ్చే నెల మొదటివారంలో ఢిల్లీకి చంద్రబాబు, పవన్..!!

వచ్చే నెల మొదటివారంలో టీడీపీ అధినేత చంద్రబాబు,( Chandrababu ) జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో మరో నాలుగైదు రోజుల్లో టీడీపీ - జనసేన -బీజేపీ( TDP-Janasena-BJP ) పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే రేపు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశానికి కొనసాగింపుగా పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది.

Chandrababu, Pawan : వచ్చే నెల మొదటివారంల�

ఇందులో ప్రధానంగా పొత్తులపై నిర్ణయంతో పాటు ఏపీలో పోటీ చేసే స్థానాలపైన చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.కాగా ఏపీలో ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లను బీజేపీ ఆశిస్తోంది.ఈ క్రమంలోనే అరకు, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నరసాపురం, తిరుపతి, హిందూపురం మరియు రాజంపేట లోక్ సభ స్థానాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించిందని తెలుస్తోంది.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi )తెలంగాణ పర్యటనకు ముందే ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

Advertisement
Chandrababu, Pawan : వచ్చే నెల మొదటివారంల�

తాజా వార్తలు