మొత్తానికి టీ టీడీపీ పై ఇలా ఫిక్స్ అయ్యారా ..? కానివ్వండి 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆర్ ఎస్, బిజెపి , కాంగ్రెస్ లను ఓడించి తెలంగాణలోనూ టిడిపి సత్తా చాటాలని చాలాకాలంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

అయితే 2014 నుంచి టిడిపి ప్రభావం తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉంటూ వస్తుంది.పేరుకే పార్టీ తప్ప పెద్దగా కార్యక్రమాలు ఏవి నిర్వహించేవారు కాదు.

కేడర్ కూడా చెల్ల చేదురైంది.కీలక నాయకుడు అనుకున్న వారంతా అధికార పార్టీ బీ,  కాంగ్రెస్ , బిజెపిలలో చేరిపోయారు.

ఇక తెలంగాణలో టిడిపి పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో తెలంగాణలో పార్టీని మరింత యాక్టివ్ చేయాలని చంద్రబాబు కొద్ది నెలల కిందే డెసైడ్ అయ్యారు.అందుకే ఆర్థికంగా బలవంతుడైన కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నియమించారు.

Advertisement

        తర్వాత పార్టీలో తన మార్క్ చూపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ సభలు,  సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి టిడిపి ఉనికి చాటే ప్రయత్నం చేశారు.ఇక నిత్యం జనాల్లో ఉండే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

అలాగే యాగాలు కూడా నిర్వహిస్తున్నారు.టిడిపి హైదరాబాద్ ఆఫీసులో దశ మహా విద్య పూర్వక నవ చండీయాగం నిర్వహించారు.

దీనికి చంద్రబాబు కూడా హాజరయ్యారు.అలాగే మరికొన్ని యాగాలను నిర్వహించేందుకు జ్ఞానేశ్వర్ ప్రయత్నాలు చేస్తున్నారు .   

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...

  ఏదో రకంగా టిడిపి ఉనికిని చాటడం వల్ల పార్టీలో యాక్టివ్ గా లేని నేతలంతా మళ్ళీ యాక్టివ్ అవుతారని,  సరైన ప్రాధాన్యం దక్కక సైలెంట్ గా ఉంటున్న వారంతా మళ్ళీ టిడిపి గూటికి చేరతారని జ్ఞానేశ్వర్ ఆశలు పెట్టుకుంటున్నారు.తెలంగాణ అంతట ప్రభావం చూపించలేకపోయిన,  బలమైన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ టిడిపి అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా,  రాబోయే రోజుల్లో టిడిపి బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

Advertisement

అసలు ఎన్నికల సమయం నాటికి టిడిపి బలోపేతం అయితే పొత్తుల కోసం ప్రధాని పార్టీలే తమ వెంట పడతాయని అటు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ కూడా అంచనా వేస్తున్నారు.ఏదో రకంగా తెలంగాణలో టిడిపికి ఆదరణ పెంచడమే లక్ష్యంగా ఆయన ఇప్పుడు రకరకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. .

తాజా వార్తలు