బాబు ఢిల్లీ వెళ్తోంది అందుకా ? అమిత్ షా ఒప్పుకుంటారా ?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది.

అయినా ముందస్తు ఎన్నికలకు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM jagan ) వెళ్తారనే అనుమానాలు విపక్ష పార్టీల్లో నెలకొన్నాయి.

దీంతో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నాయి.దీనిలో భాగంగానే ముందస్తు ఎన్నికలు వచ్చినా,  తమ గెలుపునకు డోకా లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

రాబోయే ఎన్నికల్లో వైసిపి ( YCP )ఒంటరిగా పోటీ చేయబోతుండగా , టిడిపి ,జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయి.అయితే బీజేపీని కలుపుకు వెళ్లాలనే ఆలోచనతో జనసేన టిడిపిలు ఉన్నాయి.

అయితే జనసేనతో ప్రస్తుతం బిజెపి పొత్తు కొనసాగిస్తుంది.

Advertisement

కానీ టిడిపి తో కలిసి వెళ్ళేందుకు బిజెపి ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నాలు చేస్తున్న, అవన్నీ విఫలమవుతూనే వస్తున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు.

ఈ టూర్ లో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ లభించినట్లు టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

అమిత్ షా( Amith shah ) తో భేటీ కి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే , పొత్తుల అంశం లో క్లారిటీ తీసుకునేందుకే చంద్రబాబు అమిత్ షా తో భేటీ అవుతున్నారని, జనసేన టిడిపి బీజేపీలు కలిసి ఎన్నికలకు వెళ్తేనే వైసీపీని ఓడించగలమనే లెక్కలను అమిత్ షా వద్ద చంద్రబాబు ప్రస్తావించబోతున్నారట.అలాగే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు అన్నిటిని వివరించి, బిజెపిని పొత్తుకు ఒప్పించే ప్రయత్నాలు చంద్రబాబు( N.Chandrababu Naidu ) చేయబోతున్నారట.ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చిన తర్వాత బిజెపి అగ్ర నేతలను చంద్రబాబు కలవబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే టిడిపి తో పొత్తు విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంత ఆసక్తిగా లేరు.అప్పట్లో టిడిపి ప్రభుత్వ హయాంలో అమిత్ షా కుటుంబం తిరుపతికి వచ్చినప్పుడు ఆ కార్లపై టిడిపి శ్రేణులు రాళ్లదాడికి పాల్పడడం , మోడీ అమిత్ షాలపై వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం వంటి వ్యవహారాలను ఇప్పటికీ సీరియస్ గానే తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసే పొత్తు ప్రతిపాదనకు అమిత్ షా ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు