Chandrababu : టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ..!

టీడీపీ( TDP ) ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) భేటీ అయ్యారు.

ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది.

ఈ క్రమంలో యనమల, రామానాయుడు, అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, గొట్టిపాటి రవి, సౌమ్య, అనగాని సత్యప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు.ఇందులో ప్రధానంగా సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థుల జాబితా ప్రకటనపై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ - జనసేన కూటమి( TDP - Janasena ) అభ్యర్థుల తొలి జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.టీడీపీ సిట్టింగ్ స్థానాల్లో ఉన్న వారి పేర్లు ఈ జాబితాలో ఉంటాయా? లేదా? అన్న దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది.కాగా ఇవాళ టీడీపీ - జనసేన తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.

ఈ లిస్ట్ లో సుమారు 60 నుంచి 70 అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.అలాగే ఈ జాబితాలో యాభైకి పైగా టీడీపీ అభ్యర్థులు ఉంటారని సమాచారం.

Advertisement
ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?