తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు హైదరాబాద్ కు రానున్నారు.

ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లనున్న ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.అనంతరం తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం.

తాజా వార్తలు