స్కిల్ డెవలప్‎మెంట్ స్కామ్‎లో చంద్రబాబే ప్రధాన సూత్రధారి..: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ

స్కిల్ డెవలప్‎మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు.స్కిల్ డెవలప్‎మెంట్ లో మొత్తం రూ.

550 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారని సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ వెల్లడించారు.ఈ క్రమంలోనే షెల్ కంపెనీలకు రూ.371 కోట్లు తరలించారన్నారు.ఈ కుంభకోణంలో చంద్రబాబు ప్రధాన సూత్రధారి అని చెప్పారు.

చంద్రబాబే నిధులు విడుదల చేశారన్న ఆయన అగ్రిమెంట్లు అన్నీ చంద్రబాబు చెబితేనే జరిగాయని స్పష్టం చేశారు.డిజైన్ టెక్ అనే కంపెనీకి దాని నుంచి షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని తెలిపారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు