కుప్పంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న చంద్రబాబు..!

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఇంకా ఉత్కంఠకు దారితీస్తోంది.ఇటీవలే ఆయన రోడ్ షో ని పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే.

ఆ సమయంలో పోలీసులకు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో లాఠీచార్జ్ చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలోని పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో తన నియోజకవర్గంలో తనని తిరగకుండా అడ్డుకునే హక్కు ఎవరు ఇచ్చారని పోలీసులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతూ సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

సైకో ముఖ్యమంత్రికి బానిసలుగా బతకొద్దని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.జీవో 1కి చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

తమ రోడ్ షో అడ్డుకున్న ముఖ్యమంత్రి రాజమండ్రిలో రోడ్డు షో నిర్వహించడానికి సిగ్గు లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు.నిన్న కూడా పలు ప్రాంతాలలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు రోడ్డు షోలు నిర్వహించారని ఆరోపించారు.

వైసీపీ నేతలకు ఒక రుల్.? తనకి మరో రూలా? అని పోలీసులను ప్రశ్నించారు.పోలీసులు బాధ్యతతో వ్యవహరిస్తే ప్రజలకు మేలు చేకూరుతుంది.

లేకపోతే తాను అధికారంలోకి వచ్చాక పోలీసులను మళ్ళీ గాడిలో పెడతానని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నల్ల జీవోలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement