Sajjala Ramakrishna Reddy : డిక్లరేషన్ల పేరుతో చంద్రబాబు మాయ చేస్తున్నారు..: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎస్సీ, బీసీ డిక్లరేషన్ల పేరుతో చంద్రబాబు( Chandrababu ) మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు.

కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

సీఎం జగన్( CM YS Jagan ) చేసినవన్నీ తానే చేసినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారు.ప్రజలకు సంబంధం లేని విషయాలను మాట్లాడటమే కాకుండా సీఎం జగన్ పై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.రాజకీయ నేతగా ఉన్న చంద్రబాబు గతంలో ఏం చేశాడు.? అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాలని సూచించారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు