తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబుకు భయం..: మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు.చట్టానికి చంద్రబాబైనా, ఇంకా ఎవరైనా ఒక్కటేనని చెప్పారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబుకు భయమని మంత్రి అంబటి విమర్శించారు.

అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అధికారులు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.ప్రజల్లో సింపతీ పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

అవసరం అయితే తప్పకుండా అరెస్ట్ చేస్తారన్న మంత్రి అంబటి నోటీసులు ఇస్తే సమాధానం చెప్పాలని తెలిపారు.చంద్రబాబు రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నారని దర్యాప్తు సంస్థలు అంటున్నాయన్నారు.ఈ క్రమంలో ప్రాథమిక ఆధారాలతోనే కేసు నమోదు చేశారని వెల్లడించారు.

Advertisement
ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!

తాజా వార్తలు