కూటమి ఏజెంట్లకు చంద్రబాబు సూచనలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే కూటమి ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు.ఎట్టి పరిస్థితులలో సంయమనం కోల్పోవద్దని పేర్కొన్నారు.

కౌంటింగ్ కేంద్రాల్లో( Counting Centers ) ఉండే కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.లెక్కింపుల్లో అనుమానం వస్తే వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి.

అన్ని రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే వరకు బయటకు రావద్దు.పోలైన లెక్కింపుల్లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలి.

ఓటమిని తట్టుకోలేక వైసీపీ నాయకులు హింసకు పాల్పడే అవకాశం ఉంది.

Advertisement

కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోకూడదు అని సూచించారు.రేపే కౌంటింగ్ నేపథ్యంలో సోమవారం టీడీపీ, జనసేన, బీజేపీ( TDP Janasena BJP ) కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫిరెన్స్ లో పాల్గొన్నారు.2024 ఎన్నికలను చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు.గెలుపే లక్ష్యంగా వ్యవహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపొకుండా.బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో చివరిలో పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) కలిసి గోదావరి జిల్లాలలో.అనేక సభలలో పాల్గొనడం జరిగింది.

పోలింగ్ 80 శాతానికి పెరగటంతో కూటమి గెలుస్తుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం కూటమికి అనుకూలంగా వచ్చాయి.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
ఆ ఎమ్మెల్యేలపై లీగల్ వార్ కు బీఆర్ఎస్ రెడీ 

దీంతో రేపు కౌంటింగ్ నేపద్యంలో.పోలింగ్ కేంద్రాలలో ఉండే కూటమి ఏజెంట్లకు చంద్రబాబు కీలక సూచనలు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు