CM Jagan : చంద్రబాబు చేసింది సున్నా..: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )చేసింది ఏమీ లేదని సీఎం జగన్( CM Jagan ) అన్నారు.

చంద్రబాబు హయాంలో కుప్పంలో ఇళ్ల పట్టాలు ఇచ్చింది సున్నా అన్న సీఎం జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం అభివృద్ధి చెందిందని చెప్పారు.

లంచాలకు తావు లేకుండా వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నామన్నారు.కుప్పంలో( Kuppam ) రైతు భరోసా కింద రూ.214 కోట్లు ఇచ్చామన్న సీఎం జగన్ చంద్రబాబు మహిళా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు.తాము అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలిచామన్నారు.

వైఎస్ఆర్ ఆసరా పథకం కింద రూ.26 వేల కోట్లు ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు.ఒక్క కుప్పంలోనే 44,888 మంది అక్కా చెల్లెమ్మలకు రూ.172 కోట్లు అందించామని చెప్పారు.అమ్మఒడి కింద రూ.155 కోట్లు, వైఎస్ఆర్ చేయూత( YSR Cheyutha ) ద్వారా రూ.85 కోట్లు ఇచ్చామన్న సీఎం జగన్ కుప్పంలో తాము ఇప్పటికే 15,721 పట్టాలను ఇచ్చామని తెలిపారు.ఈ నెలలోమరో 15 వేల పట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.ఆరోగ్య శ్రీ, ఆరోగ్య సురక్ష ద్వారా 17,552 మందికి రూ.64 కోట్లు ఇచ్చామని, వైఎస్ఆర్ విద్యాదీవెన, వైఎస్ఆర్ వసతి దీవెన కింద 12,093 మందికి రూ.61 కోట్లు అందించామని తెలిపారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement