భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్

విశాఖలోని పాయకరావుపేటలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం కాబట్టే తనపై చంద్రబాబు( Chandrababu ) కక్షగట్టారని సీఎం జగన్ అన్నారు.

అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్ విప్లవం కాదా అని సీఎం జగన్ పేర్కొన్నారు.అమ్మఒడి పథకం( Ammavodi ) గతంలో ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విప్లవం కాదా అని ప్రశ్నించారు.

మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించే పథకాలు విప్లవం కాదా అన్నారు.ఆరోగ్య శ్రీ( Aarogya Sri ) పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని పేర్కొన్నారు.లంచాలు లేకుండా గతంలో ఏనాడైనా పథకాలు అందాయా అని అడిగారు.

ఇవన్నీ వైసీపీ పాలనలో విప్లవాలు అవునా ? కాదా? అనేది ఆలోచన చేయాలన్నారు.భూములపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్న సీఎం జగన్ మీ భూములపై మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) అని చెప్పారు.

Advertisement

తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసన్నారు.తాను భూములు ఇచ్చేవాడినే కానీ కాజేసే వాడిని కాదని తెలిపారు.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు
Advertisement

తాజా వార్తలు