చీకటి రోజు అంటున్న బాబు,యూజ్ లెస్ ఫెలోస్ అంటున్న అచ్చెన్న

ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి టీడీపీ నేతలు పిలుపునివ్వడం తో ఏపీ ప్రభుత్వం వారికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు.

అయినప్పటికీ టీడీపీ నేతలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించగా దానికి ప్రభుత్వం అనుమతి లేని కారణంగా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని కూడా ఈ కార్యక్రమం చేపట్టకుండా అడ్డుకోవడం లో భాగంగా ఆయనను ఇంటిలోనే హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.దీనితో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

  ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు అని బాబు విరుచుకుపడ్డారు.అలానే ఆయన హౌస్ అరెస్ట్ కు నిరసనగా ఆయన ఉండవల్లి లోని ఆయన గృహం లోనే నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు కూడా.మరోపక్క మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బాబు ను కలవాలని వెళుతున్న సమయంలో ఆయనను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

దీనితో ఆయన కూడా తనదైన శైలి లో పోలీసులపై మండిపడ్డారు.రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.టీడీపీ నేతల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు పై ఆయన చిందులు తొక్కారు.

Advertisement

  పోలీసులు యూజ్ లెస్ ఫెలోస్ అంటూ వ్యాఖ్యానించారు.చంద్రబాబు నివాసానికి బయలు దేరిన అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.దీంతో పోలీసులకు, అచ్చెన్నాయుడికి మధ్య కొంతసేపు వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.

ఒకవేళ కార్యకర్తలను రక్షించేందుకు తానూ జైలుకు కూడా వెళ్ళడానికి సిద్ధమంటూ అచ్చెన్న వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు