దొంగ ఓట్ల సృష్టికర్త చంద్రబాబే..: గోరంట్ల మాధవ్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత, ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

దొంగ ఓట్ల సృష్టికర్త చంద్రబాబేనన్న ఆయన తెలంగాణలో ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తి అని ఆరోపించారు.

దొంగే దొంగ అన్నట్లు ఉంది చంద్రబాబు తీరంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శలు చేశారు.అదేవిధంగా కరెంట్ పై ఆయన వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కరెంట్ కోసం ఆందోళన చేసిన రైతులను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుదని తెలిపారు.సీఎం జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్న గోరంట్ల గుత్తిలో చంద్రబాబు నిర్వహించనున్న సభను అడ్డుకుంటామని వెల్లడించారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు