కమల్ హాసన్ ని డామినేట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

అదేంటి కమలహాసన్‌ని( Kamal Haasan ) కొట్టే నటుడు మన తెలుగులోనా? కామెడీ చేయొద్దు అని అంటారా? లేదండీ.మీరు విన్నది నిజమే.

కమలహాసన్‌ నటించిన ఓ సినిమాని మన తెలుగువాళ్లు చేయగా సదరు సినిమాలోని మన తెలుగు నటుడు కమలహాసన్‌ని మించిపోయే నటన కనబరిచాడు.ఆయన మరెవ్వరో కాదు.

సీనియర్ నటుడు చంద్రమోహన్.( Chandra Mohan ) అవును, నటుడు చంద్రమోహన్ నట విశ్వరూపానికి ప్రతీకగా 1978 లో వచ్చిన ఈ పదహారేళ్ళ వయసు( Padaharella Vayasu Movie ) సినిమాని చెప్పుకోవచ్చు.

ఈ సినిమా శ్రీదేవిని( Sridevi ) స్టార్ చేసి, అప్పటి బడా హీరోయిన్స్ జయప్రద, జయసుధల సరసన నిలబెట్టింది.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ కనబరిచిన ఈ సినిమా విడుదలయిన ఆల్మోస్ట్ అన్ని కేంద్రాలలో 100 రోజులు ఆడి, సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.

Advertisement

ఈ సినిమా బేసిగ్గా తమిళంలో హిట్ అయిన "16 వాయతినిలె"కు( 16 Vayathinile ) రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసినదే.తమిళంలో కూడా శ్రీదేవి హీరోయిన్ గా నటించగా, కమల్ హాసన్, రజనీకాంత్ హీరోలుగా నటించారు.అయితే తమిళ సినిమాలోని కమల్ హాసన్ పాత్రని ఇక్కడ చంద్రమోహన్ చేసారు.

అయితే తమిళంలో హిట్టయిన ఈ సినిమా మన తెలుగులో కూడా అద్భుతంగా ఆడింది.ఇంకా చెప్పాలంటే అక్కడికంటే కూడా ఇక్కడ ఇంకాస్త బెటర్ గా ఆడిందని చెప్పుకోవచ్చు.

అప్పటి క్రిటిక్స్ కమల్ హాసన్ నటన కంటే కూడా తెలుగు హీరో చంద్రమోహన్ నటనే బావుందని కొనియాడారు.అది నిజంగా సీనియర్ నటుడు చంద్రమోహన్ నట జీవితానికి ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు.

ఇదేమీ సందేశాత్మక సినిమా కాదు.ఓ పదహారేళ్ళ పల్లెటూరి అమాయక అమ్మాయి ప్రేమకథ సినిమా. ఆ వయసులో సహజంగా ఉండే ఆలోచనలు, ఆకాంక్షలు, వయసు తెచ్చే కష్టాలకు ప్రతిరూపమే ఈ సినిమా.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

కధ, స్క్రీన్ ప్లే, చిత్రీకరణ, ముఖ్యంగా పాటలు ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించి సూపర్ హిట్ చేసాయి.శ్రీదేవి అచ్చంగా 16 ఏళ్ల వయస్సు కలిగి చాలా అమాయకంగా నటించింది ఇందులో.

Advertisement

ఇక ఈ సినిమా తరువాత ఆమెకూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు.చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్.

ఇక పాటలను అన్నీ వేటూరి వారే వ్రాసారు.అదేవిధంగా బాలసుబ్రమణ్యం, యస్ జానకిలే మొత్తం పాటలు పాడారు.

ముఖ్యంగా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ అని చెప్పుకోవచ్చు.ఆ తర్వాత కాలంలో తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన భారతీరాజాయే హిందీలో "సోల్వా సావన్" టైటిలుతో అమోల్ పాలేకర్ హీరోగా, శ్రీదేవియే కధానాయికగా పెట్టి తీస్తే హిందీలో సరిగ్గా ఆడలేదు.

ఇప్పటికీ ఒరిజినల్ సినిమాకంటే కూడా మన తెలుగు సినిమానే హైలెట్ అని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు