దసర సినిమా వల్ల మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి...

తెలుగు బుల్లితెర యాంకర్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్తానం సంపాదించుకుంది యాంకర్ ఝాన్సీ( Anchor Jhansi ) ఒకప్పుడు స్టార్ యాంకర్స్ ఎవరు అంటే ఝాన్సీ పేరే ముందు వరుసలో వినిపించేది .

అంతగా ఆడియెన్స్ ని కట్టిపడేసింది ఆ తర్వాత మెల్లగా తాను చేసే షోస్ తగ్గిపోయాయి ఇటీవలే మళ్ళి అప్పుడప్పుడు కొన్ని షోస్ , సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తుంది .

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వూస్ లో ఝాన్సీ ఆమె కెరీర్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది .

తన కష్టాల జర్నీ గురించి ఝాన్సీ మాట్లాడుతూ నాతో కలిసి పనిచేసినవారికి మాత్రమే నేను ఏమిటనేది తెలుస్తుంది.అవతలవారు నా గురించి చాలా అనుకుంటారు.ఈవిడకి పొగరు మాట్లాడితే ఎదో విప్లవం అంటుంది ఫైర్ బ్రాండ్ అని అనుకుంటారు.

కానీ ,నాతో కలిసి పనిచేసిన తరువాత నేను ఏమిటనేది వారికి అర్థమవుతుంది.నన్ను అర్థం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు జర్నీ చేసేవారు.

Advertisement

నచ్చని వారు మాత్రం 13 ఎపిసోడ్స్ తో ఆపేసేవారు అని ఆవేదన వ్యక్తం చేసింది ఇంకా ఆమె మాట్లాడుతూ నన్ను చాలామంది మోసం చేశారు.అయితే అది గుర్తుపెట్టుకుని కక్ష సాధించే పని నేను చేయలేదు.

అది నా మంచితనమో పిచ్చితనమో కూడా తెలియదు.

ఇక ఆమె తన జీవితం లో ఒక పెద్ద తప్పు చేశాను అని కూడ చెప్పారు అది ఏంటంటే పెళ్లి చేసుకోవడం దాని వాళ్ల ఒక పాప కి కూడా జన్మనిచ్చారు.ఆమెని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వ్యక్తి ఎవరంటే జోగి బ్రదర్స్ లో జోగి నాయుడు( Jogi Naidu ) ఈయన కూడా చాలా సినిమాల్లో నటించి మనందరికీ తెలిసిన వ్యక్తే వీళ్లిద్దరూ పెళ్లి అయి పాప పుట్టిన కొద్ది రోజులకే విడిపోయారు కానీ ఝాన్సి మాత్రం కొంచం కూడా కృంగిపోకుండా ఆ పాప ని పెంచుతూ ఇంకో పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.ప్రస్తుతం ఆమె సినిమాలు చేస్తూ తన లైఫ్ ని లీడ్ చేస్తుంది ఇక రీసెంట్ గా వచ్చిన దసర సినిమాలో కీర్తి సురేష్ అమ్మ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాలో మంచి రోల్ పడటం తో మళ్ళీ ఆమెకి సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి అని తెలుస్తుంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు