ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకు, ప్రతి జంతువుకు, ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది.దానికంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది.
మనం రోజు చూసే పందులను అసహించుకుంటాం.పందులను చూడగానే మనం దూరంగా వెళ్లాలనుకుంటాం.
పందుల వల్ల కొన్న జబ్బులు వస్తాయి.అయితే పందులు దేనికి పనికి రావు అనుకుంటే మాత్రం పూర్తిగా అవివేకం అవుతుంది.
ఎంతో మంది పందుల వల్ల బాగు పడుతున్న దాఖలాలు ఉన్నాయి.కొన్ని చోట్ల పందిని ఆహారంగా కూడా తీసుకుంటూ జీవితంను గడిపేస్తున్నారు.
ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న పందులు ఒక వ్యక్తికి మాత్రం ఏకంగా కోట్ల రూపాయలను తెచ్చి పెట్టింది.
చైనాకు చెందిన ఒక రైతు సైడ్ ఇన్‌కం కోసం కొన్ని పందులను పెంచుతున్నాడు.అతడు తన పందులను అందరిలాగే చాలా కామన్‌గా చూస్తూ ఉంటాడు.వాటిని మరీ పెట్స్ మాదిరిగా చూడకున్నా వాటిపట్ల కాస్త శ్రద్ద జాలీ చూపిస్తూ ఉండేవాడు.
అలాంటి ఆ రైతుకు ఒక రోజు ఒక పంది వద్ద ఉన్న ఒక వింత వస్తువు లేదా పదార్థం లేదా రాయి అనుకోండి.అలాంటిది ఏదో కనిపించింది.
పంది బొడ్డు భాగం నుండి బయటకు వచ్చిన ఆ రాయిలాంటి దాన్ని తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాడు.ఆ సమయంలో అతడు దాని గురించి ఎలాంటి ఒక నిర్ధారణకు రాలేక పోయాడు.
అయితే ఆ ఆకారంలో ఉన్న వస్తువు ముఖ్యమైనది అయ్యి ఉంటుందని, దాన్ని అమ్మడం వల్ల అంతో ఇంతో డబ్బులు వస్తాయేమో అని భావించాడు.దాన్ని పట్టుకుని షాంగై నగరానికి వెళ్లాడు.అక్కడ పలు చోట్ల దాన్ని చూపించగా ఒకచోట దాన్ని గురించారు.
అది అత్యంత అరుదైన ఒక పదార్థం అని, దాన్ని ఉపయోగించి శరీరంలో ఉన్న విషంను విరుగుడు చేయవచ్చు అని, అలాగే మనిషి చావు బతుకుల్లో ఉంటే కాపాడవచ్చు అంటూ ఒక నిర్ధారణకు వచ్చారు.
ఆ ప్రయోగశాలలో దీని విలువ ఖచ్చితంగా లక్షలకు మించి ఉంటుందని వారు అన్నారు.దాంతో ఆ రైతు మొహంలో ఆనందం కలిగింది.తన జీవితంలో అద్బుతం జరిగినందుకు అతడు చాలా సంతోషంగా ఉన్నాడు.
తనకు దాని గురించి ఇంకా తెలుసుకోవాలనుంది.దాంతో అందుకోసం దాన్ని చాలా ప్రయోగశాలల్లో పరిశోదనకు పంపించాడు.
ఎక్కడ చూసినా ఒకటే సమాధానం.అది చాలా ఖరీదైనది అని, దాంతో దాన్ని వేలం వేయాలని నిర్ణయానికి వచ్చాడు.
4 కోట్లకు అమ్మేందుకు సిద్దం అయినా కూడా కొందరి సలహా మేరకు వేలం పాట వేయడం మొదలు పెట్టాడు.అతడు ఊహించని విధంగా రేటు పలికింది.మొత్తంగా అతడు ఒక సామాన్య రైతు నుండి ఓవర్ నైట్‌లో పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు.
అతడు ఆ పందిని ఎంత అపురూపంగా చూసుకుంటూ ఉంటాడో కదా.బంగారు గుడ్లు పెట్టే కోళ్లను విన్నాం అవి మనకు తగులవు.చివరకు పందులు కూడా చైనా వారికి కోటలను కురిపిస్తున్నాయి.
కాని మనకు మాత్రం ఏ ఒక్క అదృష్టం కలిసి రావడం లేదు.ప్రతి మనిషికి ఒక రూపంలో లక్ వస్తుంది.
దాన్ని వచ్చిన సమయంలో సరిగ్గా యూజ్ చేసుకోవాలి.ఆ రైతు పంది కడుపు నుండి వచ్చింది కదా అంటూ పారేస్తే పరిస్థితి ఎలా ఉండేది.
అందుకే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అనేది ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy