వ‌న్‌టైమ్ యూస్ ప్లాస్టిక్‌పై కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం.. అప్ప‌టి నుంచి నిషేధం..

ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో ప్లాస్టిక్ వాడొద్దని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నప్పటికీ ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది.

ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో మానవాళి మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులున్నాయి.కాబట్టి ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలని చెప్తున్నారు నిపుణులు.

కాగా, ప్లాస్టిక్ విషయమై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వన్ టైమ్ యూసేజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది.

వచ్చే ఏడాది అనగా 2022 జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన చర్యల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్వహణ సవరణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది.

Advertisement
Central Govt To Ban Single Use Plastic July 2022, Central Govt, Single Use Plast

ఉపయోగం తక్కువగా ఉంటూ, చెత్తగా పోగుపడే అవకాశం అధికంగా ఉన్న ఆర్టికల్స్ మేకింగ్, నిల్వ, దిగుమతి, పంపిణీ, అమ్మకం, వినియోగాలపై విధించిన ఈ నిషేధం 2022 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది.దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.

దీంతో కొంతమేరకు ప్లాస్టిక్ వినియోగం తగ్గే చాన్సెస్ ఉన్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.ఇందుకుగాను కేంద్రం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు, 2021ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రూపొందించింది.

ఈ రూల్స్ ప్రకారం.ప్లాస్టిక్ పుల్లలతో ఉండే ఇయర్‌బడ్స్, బెలూన్స్‌కు ఉండే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్ కోసం ఉపయోగించే పాలీస్టైరీన్, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, చెమ్చాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్స్‌ల ర్యాపింగ్, ప్యాకింగ్ ఫిలింస్, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బ్యానర్లు వంటివాటిపై త్వరలో బ్యాన్ అమలవుతుంది.

Central Govt To Ban Single Use Plastic July 2022, Central Govt, Single Use Plast

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.2021 సెప్టెంబరు 30 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందం 50 మైక్రాన్ల నుంచి 75 మైక్రాన్లకు, 120 మైక్రాన్లకు పెంచుతారు.ఇవి దళసరిగా ఉంటాయి కాబట్టి వీటిని, మళ్లీ మళ్లీ యూజ్ చేయడానికి ఇస్తారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

ఇకపోతే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలను పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు