NHలను ఉపయోగించే వారికి శుభవార్త.. ఏడాది, జీవితకాల టోల్ పాస్‌లు అందుబాటులోకి

జాతీయ రహదారులను( National Highways ) తరచుగా ఉపయోగించే మధ్య తరగతి, ప్రైవేట్ కార్ యజమానులకు కేంద్ర ప్రభుత్వం( Central Government ) గొప్ప శుభవార్త చెప్పింది.

టోల్ గేట్ల అపరిమిత వినియోగం కోసం ఏడాది టోల్ పాస్,( Annual Tollpass ) జీవిత కాలపు టోల్ పాస్( Lifetime Tollpass ) లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కొత్త రూల్స్ ప్రకారం.ఏడాది టోల్ పాస్ కోసం కేవలం రూ.3,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.అలాగే జీవిత కాలపు టోల్ పాస్ కోసం రూ.30,000 చెల్లిస్తే సరిపోతుంది.అయితే, ప్రభుత్వం నిబంధనల ప్రకారం వాహనం జీవిత కాలం 15 సంవత్సరాలు వరకు మాత్రమే ఉండనుంది.

ఈ జీవిత కాలపు పాస్ కూడా 15 సంవత్సరాలపాటు వర్తించనుంది.

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణాలు చేసే వినియోగదారులకు ఈ పాస్‌లు పెద్ద ఊరట కలిగించనున్నాయి.ఇప్పటివరకు ఒకే టోల్ ప్లాజాను దాటడానికి నెలవారీ పాస్‌ను మాత్రమే వినియోగదారులు పొందగలిగే పరిస్థితి ఉండేది.నెలవారీ పాస్ ధర రూ.340, దీన్ని ఏడాదికి రూ.4,080 చెల్లించాల్సి వచ్చేది.కానీ ఏడాది టోల్ పాస్ ఇప్పుడు కేవలం రూ.3,000 మాత్రమే ఉండటం వినియోగదారుల్లో ఆనందాన్ని తెచ్చింది.

Advertisement

జాతీయ రహదారులపై టోల్ గేట్లకు( Toll Gates ) సంబంధించి ప్రజల నుండి వచ్చిన ఆందోళనలపై రోడ్డు రవాణా శాఖ సమాధానాన్ని ప్రకటించింది.ముఖ్యంగా 60 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోనే టోల్ ప్లాజాల నిర్మాణంపై ఆగ్రహం వ్యక్తమవుతుండగా, కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త పాస్‌లు సమస్యకు పరిష్కార మార్గం చూపుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల మాట్లాడుతూ కార్ల యజమానులకు టోల్ పాస్‌లు అందించే ప్రణాళికపై మంత్రిత్వ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు.

ఈ క్రమంలోనే టోల్ పాస్‌ల ద్వారా వినియోగదారుల ఖర్చులను తగ్గించి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.ఇక ముందు ఈ టోల్ పాస్‌లతో జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులభం కానుంది.

Advertisement

తాజా వార్తలు